Vijay Deverakonda | అగ్ర నటుడు విజయ్ దేవరకొండ ఇటీవల మహాకుంభమేళాలో పాల్గొని పవిత్రస్నానమాచరించారు. అనంతరం కుటుంబ సమేతంగా ఆయన కాశీ విశ్వనాథుడ్ని దర్శించుకున్నారు. తాజాగా ఈ ఫొటోలను తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో షేర్ చేశారు విజయ్ దేవరకొండ.
ప్రియమైన వ్యక్తులతో కలిసి చేసిన కాశీ యాత్ర ఎన్నో మధురానుభూతులను మిగిల్చిందని, మన ధార్మిక సంస్కృతితో మమేకమవుతూ చేసిన గొప్ప ప్రయాణమిదని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. విజయ్ దేవరకొండ షేర్ చేసిన ఫొటోల్లో దర్శకుడు వంశీ పైడిపల్లి, అల్లు అర్జున్ సతీమణి స్నేహా రెడ్డి కూడా ఉన్నారు.