Liger Movie | ‘లైగర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.. ఎప్పుడు, ఎక్కడంటే?
Liger Movie Pre-Release Event | రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నుండి సినిమా వచ్చి రెండేళ్ళు దాటింది. ‘వరల్డ్ ఫేమస్ లవర్’ తర్వాత ఇప్పటివరకు ఈయన నుండి మరో సినిమా రాలేదు. ప్రస్తుతం ఈయన నటించిన ‘లైగర్’ కోసం అభిమానులు ఎంత గానో ఎదురు చూస్తున్నారు. పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన పోస్టర్లు, ట్రైలర్ సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్ చేశాయి. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 25న విడుదల కానుంది. ఈ క్రమంలో మేకర్స్ వరుస ప్రమోషన్లతో ఇండియా మొత్తం చుట్టుస్తున్నారు. ముఖ్యంగా నార్త్‌లో ఈ సినిమా చేస్తున్న ప్రమోషన్లు అంతా ఇంతా కాదు. ఇప్పటికే ఈ చిత్రంపై విపరీతమైన బజ్ ఏర్పడింది.
తాజాగా మేకర్స్ లైగర్ ప్రీ రిలీజ్ వేడుకకు సంబంధించిన అప్డేట్ను ప్రకటించింది. గుంటూరులోని చలపతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గ్రౌండ్స్‌లో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను మేకర్స్ నిర్వహించనున్నట్లు పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రాన్ని కరణ్‌జోహర్, ఛార్మీతో కలిసి పూరి స్వీయ నిర్మాణంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ముంబైలోని ఓ చాయ్ వాలా ప్రపంచం గుర్తించే బాక్సర్‌గా ఎలా ఎదిగాడు అనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రం తెరకెక్కింది. విజయ్‌కు జోడీగా అనన్యపాండే హీరోయిన్గా నటించింది. ప్రముఖ బాక్సర్ మైక్ టైసన్ కీలకపాత్రలో నటించాడు. ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.
Join the Grand Pre Release Event of #Liger on 20th AUG from 5PM🤩
📍Chalapathi Institute of Technology Grounds, Mothadaka, Guntur@TheDeverakonda @ananyapandayy @karanjohar #PuriJagannadh @apoorvamehta18 @DharmaMovies @PuriConnects @shreyasgroup pic.twitter.com/L3rKxpS0hc
— Charmme Kaur (@Charmmeofficial) August 18, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DGP CV Anand | యూనిఫామ్‌లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
TGSRTC | ఆర్టీసీ బకాయిల కోసం ఆస్తుల అమ్మకం.. మంత్రి ప్రకటనకు.. చప్పట్లు కొట్టిన కార్మిక నేతలు
Bathukamma | బతుకమ్మకూ నీళ్లులేవు.. కాంగ్రెస్ తెచ్చిన దుర్గతి… వరంగల్ జిల్లా ఆరెపల్లిలో కాలువకు బావినీరే గతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

