Vijay Devarkonda – Tilak Varma | రౌడి బాయ్ విజయ్ దేవరకొండతో టీమ్ ఇండియా యువ క్రికెటర్ తిలక్ వర్మ సెల్ఫీ దిగాడు. వీరిద్దరి కలిసి ఒకే ఫ్లైట్‌లో ప్రయాణిస్తుండగా.. విజయ్‌ని చూసిన తిలక్ వర్మ అతడితో కలిసి సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. మిమ్మల్ని ఫ్లైట్‌లో కలుసుకోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది అన్న. మిమ్మల్ని కలుసుకోవడం నా అదృష్టం. మళ్లీ కలుద్దాం. అంటూ తిలక్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకోచ్చాడు. కాగా ఇందుకు సంబంధించిన ఫొటో వైరల్‌గా మారింది.
విజయ్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం జెర్సీ దర్శకుడు గౌతమ్ తినన్నూరితో కలిసి వీడి12 అనే ప్రాజెక్ట్ చేస్తున్నాడు. యాక్షన్ & స్పై బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో సితార ఎంటర్టైనమెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ నిర్మిస్తున్నాడు.
తిలక్ విషయానికి వస్తే.. గత ఏడాది నవంబర్‌లో జరిగిన దక్షిణాఫ్రికా పర్యటనలో అదరగొట్టాడు. నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకోవడంలో తిలక్ కీలక పాత్ర పోషించాడు. మరోవైపు జనవరి 22 నుంచి భారత జట్టు ఇంగ్లాండ్‌తో 5 మ్యాచుల టీ20 సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌కు తిలక్ వర్మ ఎంపిక అయ్యాడు.