Liger Movie Promotions | ఈ మధ్య కాలంలో లైగర్ బృందం చేస్తున్న ప్రమోషన్లు మరేసినిమా చేయలేదు. విడుదలకు నెల రోజుల ముందు నుండి ప్రమోషన్లను జోరుగా జరుపుతుంది. విజయ్, అనన్య జనాల మధ్యలోకి వెళ్లి ప్రమోషన్లను జరుపుతూ సినిమాపై మంచి బజ్‌ను క్రియేట్ చేస్తున్నారు. పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 25న విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్రబృందం దేశవ్యాప్తంగా పలు నగరాల్లో పర్యటిస్తున్నారు.
తాజాగా విజయ్ దేవరకొండ ప్రమోషన్లో భాగంగా పాట్నా నగరానికి వెళ్లాడు. అయితే మార్గ మధ్యలో పాట్నాలో ఎంతో ఫేమస్ అయిన ‘గ్రాడ్యుయేట్ చాయ్ వాలీ’కి వెళ్ళి విజయ్ టీ తాగాడు. అంతేకాకుండా వాళ్ళతో కాసేపు ముచ్చటించి సెల్ఫీ కూడా తీసుకున్నాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం పాన్ ఇండియా లెవల్లో విడుదలవుతుంది. ఈ చిత్రాన్ని కరణ్‌జోహార్, చార్మీ, పూరి జగన్నాధ్ సంయుక్తంగా నిర్మించారు. ప్రముఖ బాక్సర్ మైఖ్ టైసన్ కీలకపాత్రలో నటించాడు.
Chaiwala- #VijayDeverakonda visited the famous ‘Graduate Chaiwali’ in the lanes of Patna as a part of today’s #Liger city promotional tour 😀#LigerOnAug25th @TheDeverakonda @ananyapandayy @karanjohar #PuriJagannadh @Charmmeofficial @apoorvamehta18 @DharmaMovies pic.twitter.com/pTjgruiM20
— Puri Connects (@PuriConnects) August 6, 2022