Vijay Devarakonda Tweet | విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం ‘లైగర్’. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది. ఇప్పటికే చిత్రం నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు, గ్లింప్స్ సినిమాపైన భారీ అంచనాలను క్రియేట్ చేశాయి. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఆగస్టు 25న విడుదల కానుంది. ఈ క్రమంలో లైగర్ టీం అప్డేట్లను స్టార్ట్ చేసింది. కాగా ఈ చిత్రం నుండి బిగ్ అప్డేట్ రానున్నట్లు తెలుస్తుంది.
తాజాగా లైగర్‌కు సంబంధించిన అప్డేట్ రాబోతున్నట్లు విజయ్ దేవరకొండ ట్విట్టర్లో కమింగ్ అని ట్వీట్ చేశాడు. ఈ క్రమంలో లైగర్ టీజర్గాని, ట్రైలర్ అప్డేట్ గాని రానుందా అని విజయ్ అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ముంబైలోని ఓ ఛాయ్ వాలా ప్రపంచం గుర్తించే బాక్సార్‌గా ఎలా ఎదిగాడు అనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రంలో విజయ్‌కు జోడీగా అనన్యపాండే హీరోయిన్గా నటించింది. కరణ్‌జోహర్, ఛార్మీతో కలిసి పూరీ స్వీయ నిర్మాణంలో తెరకెక్కిస్తున్నాడు. ప్రముఖ బాక్సర్ మైక్ టైసన్ కీలకపాత్రలో నటించాడు. ఈ చిత్రం తెలుగు తోపాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.
Coming.
— Vijay Deverakonda (@TheDeverakonda) July 1, 2022