Vijay Devarakonda Remunaration For Liger | ఇండియాస్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్‌లో ‘లైగర్’ ఒకటి. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది. వీళ్ళ కాంబోలో సినిమా అనౌన్స్ చేసినప్పటి ప్రేక్షకులలో భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇక ఇటీవలే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. ట్రైలర్లో విజయ్ మాస్ మేకోవర్ ప్రేక్షకులను ఫిదా చేసింది. కేవలం ట్రైలర్‌తోనే మేకర్స్ విధ్వంసం సృష్టించారు. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 25న విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్రబృందం వరుస ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. ముఖ్యంగా విజయ్, అనన్య పాండే జనాల మధ్యలోకి వెళ్ళి సినిమాను ప్రమోట్ చేస్తూ లైగర్‌పై మంచి బజ్ తీసుకొచ్చారు. ఇదిలా ఉంటే తాజాగా విజయ్‌కు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్‌గా మారింది.
ఈ చిత్రంలో నటించినందకు విజయ్ ఎంత పారితోషికం తీసుకొని ఉంటాడు అంటూ గత కొన్ని రోజులుగా చర్చలు జరుగుతున్నాయి. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం విజయ్ ఈ చిత్రం కోసం దాదాపు 30కోట్ల వరకు రెమ్యునరేషన్‌ను తీసుకున్నాడట. ఒక టైర్2 హీరో ఈ స్థాయిలో రెమ్యునరేషన్ అందుకున్నాడంటే విశేషం అనే చెప్పాలి. ఈ చిత్రం కోసం విజయ్ బాగానే కష్టపడ్డాడట. అంతేకాకుండా ఈ చిత్రం కోసం ఏకంగా రెండేళ్ళు కాల్షీట్లు ఇచ్చాడట.
ముంబైలోని ఓ ఛాయ్ వాలా ప్రపంచం గుర్తించే బాక్సార్‌గా ఎలా ఎదిగాడు అనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రంలో విజయ్‌కు జోడీగా అనన్యపాండే హీరోయిన్గా నటించింది. కరణ్‌జోహర్, ఛార్మీతో కలిసి పూరి స్వీయ నిర్మాణంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ప్రముఖ బాక్సర్ మైక్ టైసన్ కీలకపాత్రలో నటించాడు. ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.