Vijay Devarakonda | టాలీవుడ్ యూత్ స్టార్ విజయ్ దేవరకొండ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక స్పెషల్ సర్ప్రైజ్ వీడియోను షేర్ చేస్తూ అభిమానులను ఖుషీ చేశాడు. కెరీర్లో మొదటిసారి ఒకేసారి రెండు సినిమాలని సమాంతరంగా చేస్తున్నాను, అందుకోసం భారీగా కష్టపడుతున్నానని వీడియోలో తెలియజేశాడు. విజయ్ దేవరకొండ తన షెడ్యూల్ ఎలా బిజీగా ఉందో చూపిస్తూ, రోజూ పూజ చేస్తానని కూడా తెలియజేశాడు. తన కొత్త రోలెక్స్ వాచ్, తన బ్రాండ్ రౌడీ వేర్ కొత్త కలెక్షన్స్‌ను కూడా ఫ్యాన్స్‌కి చూపించాడు. ఓ విధంగా తన పర్సనల్ వైబ్‌ను, స్టైల్‌ను అభిమానులతో పంచుకున్నాడు. వీడియోలో రౌడీ వేర్ స్టైల్ చూపిస్తున్న సమయంలో బ్యాక్‌లో రష్మిక వాయిస్ వినిపించడం ఫ్యాన్స్‌ను మరింత ఎగ్జైట్ చేసింది.
విజయ్ ప్రస్తుతం చేస్తున్న రెండు సినిమాల్లో ఒకటి దిల్ రాజు బ్యానర్లో, రవికిరణ్ కోలా దర్శకత్వంలో తెరకెక్కుతున్న రౌడీ జనార్ధన్. ఇది రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే పవర్ఫుల్ యాక్షన్ డ్రామాగా చెప్పుకుంటున్నారు.ఈ సినిమాలో హీరోయిన్గా కీర్తి సురేష్ నటిస్తోంది. ‘మహానటి’ తర్వాత ఈ జంట కలిసి కనిపించడం ఇదే మొదటిసారి కావడంతో మంచి హైప్ ఏర్పడింది. రౌడీ జనార్ధన్ని వచ్చే సమ్మర్ లో రిలీజ్ చేయాలని టీమ్ భావిస్తోంది. విజయ్ దేవరకొండ మరో ప్రాజెక్ట్ రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోంది. టాక్సీవాలా తర్వాత ఇద్దరూ కలిసి చేస్తున్న ఈ సినిమా, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది.
ఈ చిత్రంలో హీరోయిన్గా రష్మిక మందన్నా నటిస్తోంది. పీరియాడికల్ నేపథ్యంతో రూపొందుతున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల విడుదలైన కింగ్డం సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేదు. మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, డబుల్ లైన్లో నడుస్తున్న రెండు కొత్త సినిమాలపై విజయ్ దేవరకొండ భారీ హోప్స్ పెట్టుకున్నాడని సమాచారం.ఫ్యాన్స్ కూడా విజయ్‌కి ఒక సాలిడ్ బ్లాక్‌బస్టర్ వస్తే బాగుంటుందని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ రెండు సినిమాలను పూర్తిచేసిన తరువాతే తదుపరి ప్రాజెక్టులపై నిర్ణయం తీసుకునే అవకాశముంది. మొత్తానికి ఒకేసారి రెండు భారీ ప్రాజెక్టులు చేస్తూ, తన స్టైల్, తన వర్క్ మోడ్‌ను అభిమానులతో పంచుకున్న విజయ్ దేవరకొండ ఈ వీడియోతో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ అయ్యేలా చేశాడు.