Sahiba Music Video | టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ ఓ మ్యూజిక్ ఆల్బమ్‌లో నటిస్తు్న్న విషయం తెలిసిందే. ‘హీరియే..’ సాంగ్‌తో గుర్తింపు తెచ్చుకున్న మ్యూజిక్ కంపోజర్, సింగర్ జస్లీన్ రాయల్ రూపొందించిన సాహిబా అనే ఆల్బమ్‌లో విజయ్ దేవరకొండ నటించాడు. ఇందులో విజయ్‌కి జంటగా.. రాధిక మదన్ కనిపించనుంది.
ఇప్పటికే ఈ ఆల్బమ్ నుంచి ప్రోమో విడుదల చేసిన మేకర్స్ తాజాగా ఫుల్ వీడియోను పంచుకున్నారు. ఈ ఆల్బమ్‌లో విజయ్ ఇక ముస్లిం ఫొటోగ్రాఫర్‌గా కనిపించగా… రాధిక మదన్ రాజవంశానికి చెందిన రాకుమారిగా కనిపించింది. ఇక సుధాంశు సరియా దర్శకత్వంలో వచ్చిన ఈ ‘సాహిబా’ కంప్లీట్ మ్యూజిక్ వీడియోను మీరు కూడా చూసేయండి.