రాజ్‌తరుణ్ స్టాండప్ కమెడియన్‌గా నటిస్తున్న చిత్రం ‘స్టాండప్ రాహుల్’. మోహన్ వీరంకి దర్శకుడు. నందకుమార్ అభినేని, భరత్ మగులూరి నిర్మాతలు. వర్షా బొల్లమ్మ కథానాయిక. ఫీల్‌గుడ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలోని ‘అలా ఇలా అనాలని ఇలా ఎలా ఉందే..అవీ ఇవీ వినాలని ఇవాళ తోచిందే’ అనే గీతాన్ని శుక్రవారం అగ్రహీరో విజయ్ దేవరకొండ విడుదల చేశారు. అనంత్‌శ్రీరామ్ సాహిత్యాన్నందించిన ఈ గీతానికి స్వీకర్ ఆగస్తి స్వరాల్ని సమకూర్చారు. సోషల్‌మీడియాలో ఈ పాటకు మంచి స్పందన లభిస్తోందని, ప్రేమ..వినోదం అంశాల కలబోతగా యువతరాన్ని మెప్పిస్తుందని చిత్రబృందం తెలిపింది. వెన్నెల కిషోర్, మురళీశర్మ, ఇంద్రజ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: శ్రీరాజ్ రవీంద్రన్, సంగీతం: స్వీకర్ ఆగస్తి, రచన-దర్శకత్వం: సాంటో మోహన్ వీరంకి.