Vijay Devarakonda | రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ జులై 31న కింగ్డమ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం తప్పక విజయం సాధిస్తుందనే కాన్ఫిడెంట్‌తో ఉన్నాడు. అయితే రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో మేకర్స్ ప్రమోషన్ స్పీడ్ పెంచారు. విజయ్ దేవరకొండ కూడా పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ తన సినిమా విషయాలతో పాటు వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఒక రిలేషన్షిప్లో ఉన్నానని స్పష్టం చేసి అందరికి షాక్ ఇచ్చారు. గతంలో వ్యక్తిగత జీవితం గురించి ఎప్పుడు స్పందించని విజయ్, ఈసారి మాత్రం తల్లిదండ్రులు, గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి విలువైన సమయం గడుపుతున్నానని తెలిపారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
విజయ్ ప్రస్తావించిన గర్ల్‌ఫ్రెండ్ ఎవరో చెప్పకపోయినా, నెటిజన్స్, ఫ్యాన్స్ మాత్రం ఆమె రష్మిక మందన్నే అని అనుకుంటున్నారు. గతంలో ఎన్నోసార్లు వారిద్దరి మధ్య రిలేషన్షిప్ ఉందని వార్తలు వచ్చాయి. అయితే, వీరిద్దరూ ఎప్పుడూ దాన్ని అంగీకరించలేదు. ఇటీవల వారు ఒకే కారులో వెళ్లడం, వార్షిక వేడుకల్లో కలిసి కనిపించడం తో, ఈ వార్తలకు బలం చేకూరినట్టు అయింది. ఇటీవల ఇంటర్వ్యూలో విజయ్ మాట్లాడుతూ, “35 ఏళ్ల వయసులో నేను జీవితం గురించి స్పష్టంగా ఆలోచిస్తున్నా” అని చెప్పుకొచ్చాడు. దీంతో పెళ్లి గురించి ఆయన మైండ్ సెట్టైపోయినట్టు అర్థం చేసుకుంటున్నారు అభిమానులు. అయితే ఇప్పుడు పెళ్లికి “విజయ్ సిద్ధంగా ఉన్నాడు, మరి రష్మికేనా డిలే చేస్తుందా?” అనే చర్చ మొదలైంది.
ఇక రష్మిక మందన్న విషయానికొస్తే, ప్రస్తుతం ఆమె పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉంది. భారీ లైన్అప్ ఉంది . తెలుగులో, హిందీలో, తమిళం లో వరుసగా ప్రాజెక్టులు చేస్తుంది. ఇటీవలే ఒక బిజినెస్ స్టార్ట్ చేసిన ఆమె, అదే పనిలో బిజీగా ఉంది. దీంతో ఇప్పట్లో పెళ్లికి ఓకే చెప్పే పరిస్థితి లేదు అన్న అభిప్రాయం నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు. ఈ జంటను తెరపైనే కాకుండా నిజ జీవితంలో కూడా కలిసి చూడాలనుకునే ఫ్యాన్స్ మాత్రం “వెయిటింగ్ మోడ్” లోనే ఉన్నారు.మరి ఈ జంట ఆ శుభవార్త ఎప్పుడు చెబుతుందా అని ఆసక్తిగా గమనిస్తున్నారు.