Vijay Devarakonda | రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ చాలా రోజుల తర్వాత మంచి హిట్ కొట్టాడు. కొంతకాలంగా పెద్దగా హిట్ ఇవ్వలేకపోయినా, అతని క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు.తాజాగా ఆయన నటించిన కింగ్డమ్ సినిమా రెండు రోజుల్లోనే ₹53 కోట్లు వసూలు చేసి, మరోసారి తన మార్కెట్ ఎంత బలంగా ఉందో రుజువు చేసింది. ఇక సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మీడియాతో మాట్లాడిన విజయ్, తన నెక్స్ట్ ప్రాజెక్టుల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఎలాంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, చిన్న పాత్రలతో కెరీర్ ప్రారంభించి స్టార్ హీరోగా ఎదిగిన విజయ్ దేవరకొండ ప్రస్తుతం మళ్లీ ఫుల్ ఫామ్‌లోకి వచ్చాడు.
ఇప్పుడు ఆయన చేతిలో అరడజను ప్రాజెక్టులు ఉన్నాయి. రాహుల్ సాంకృత్యాయన్ డైరెక్షన్లో మైత్రీ మూవీస్‌తో కలిసి రాయలసీమ నేపథ్యంలో చిత్రం చేయనున్నాడు. విజయ్ పూర్తిగా మాస్ పాత్రలో కనిపించనున్నాడు. షూటింగ్ ఆగస్టు చివర్లో ప్రారంభం కానుంది. వికిరణ్ కోలా దర్శకత్వంలో దిల్ రాజు బ్యానర్‌పై ఆంధ్రా కల్చరల్ బ్యాక్‌డ్రాప్‌లో ఓ చిత్రం చేయనున్నాడు. ఈ సినిమా పీరియాడిక్ డ్రామాగా ఉండనుంది. విలేజ్ ఫ్లేవర్‌తో వినూత్నంగా తెరకెక్కించబోతున్నారని టాక్. సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నట్టు సమాచారం. చరణ్ సినిమా పూర్తయ్యాక సుకుమార్ విజయ్‌తో సినిమా చేయబోతున్నట్లు సమాచారం. దీనిపై క్లారిటీ ఇచ్చిన విజయ్ త్వరలోనే తప్పక ఉంటుందని అన్నాడు.
ఇక కింగ్డమ్ బ్లాక్ బస్టర్ హిట్ కాడంతో ఇప్పుడు దానికి పార్ట్ 2 (సీక్వెల్), పార్ట్ 3 (ప్రీక్వెల్) కూడా ప్లాన్ చేస్తున్నట్లు విజయ్ వెల్లడించారు. ఈ రెండు సినిమాలు సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో, గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కనున్నాయి. విజయ్ – సందీప్ రెడ్డి వంగా కాంబోకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఈ ఇద్దరి కాంబోలో మరో సినిమా ఉండే అవకాశం పక్కాగా ఉందని విజయ్ చెప్పాడు. అయితే, ప్రస్తుతం సందీప్ చేతిలో ఉన్న ప్రభాస్ మూవీ, బన్నీ మూవీ, యానిమల్ సీక్వెల్ పూర్తయ్యాకే ఈ ప్రాజెక్ట్ మొదలవుతుంది. ఈ లైనప్ చూస్తుంటే విజయ్ దేవరకొండ రానున్న రోజులలో ప్రేక్షకులకి ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందించబోతున్నాడని తెలుస్తుంది. మాస్, క్లాస్, పీరియాడిక్, ఫోక్ బ్యాక్‌డ్రాప్ వంటి విభిన్న కథలతో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నాడు.”ఫ్లాప్స్ వచ్చి పోతాయి, కానీ ప్రయత్నం ఆగదు” అన్నట్లుగా, విజయ్ దేవరకొండ మళ్లీ తన స్థాయిని రీ-ఎస్టాబ్లిష్ చేసేందుకు సిద్ధమయ్యాడు.