Vijay Devarakonda | అగ్ర నటుడు విజయ్ దేవరకొండ తన కొత్త సినిమా కోసం కసరత్తులు మొదలుపెట్టాడు. ఇప్పటికే కింగ్డమ్ షూటింగ్‌ని పూర్తి చేసి విడుదలకు సిద్ధం చేసిన విజయ్ ప్రస్తుతం ప్రస్తుతం జుట్టు పెంచి క్లీన్ షేవ్ మీసాలతో అదిరిపోయే లుక్‌లో కనిపిస్తున్నాడు. అయితే ఈ కొత్త లుక్ రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో రాబోతున్న తన అప్‌కమింగ్ సినిమా కోసం అని తెలుస్తుంది. పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా రాబోతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా.. రష్మిక కథానాయికగా నటించబోతున్నట్లు సమాచారం. అయితే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఒక సాలిడ్ న్యూస్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. ప్రస్తుతం ప్రీ ప్రోడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం జూలై రెండో వారం నుంచి షూటింగ్ ప్రారంభించబోతున్నట్లు తెలుస్తుంది. దీనికోసం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఓ భారీ సెట్‌ను సిద్ధం చేస్తోంది చిత్ర బృందం. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రాబోతున్న ఈ చిత్రం 1854 – 1878 మధ్య కాలంలో రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే కథగా రాబోతుంది. ఈ సినిమాలో విజయ్ ఒక యోధుడిగా కనిపించబోతున్నాడు.