పూరి జగన్నాథ్ దర్శకత్వంలో హీరో విజయ్ దేవరకొండ హీరోగా ‘లైగర్’ అనే పాన్ ఇండియా సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది. రెండు నెలలకు ముందే ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసింది. ఇందులో భాగంగా ఓ పోస్టర్‌ను వదిలింది లైగర్ టీం. ఈ పోస్టర్లో విజయ్ దేవరకొండ డ్రెస్ లేకుండా కనిపిస్తాడు. ఈ ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
ప్రస్తుతం ఆన్లైన్లో ఎక్కడ చూసినా లైగర్ టీం వదిలిన విజయ్ దేవరకొండ పోస్టర్ కనిపిస్తున్నది. ఈ పోస్టర్లో విజయ్ దేవరకొండ న్యూడ్‌గా కనిపించాడు. గులాబీలను అడ్డు పెట్టుకుంటూ ఉన్న ఆ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది.
లైగర్ సినిమాలో బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ కథను మలుపు తిప్పే కీలక పాత్రలో నటించారు. ఇప్పటికే మైక్ టైసన్‌కు సంబంధించిన షూట్ అమెరికాలో పూర్తి చేసుకున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అనన్యపాండే హీరోయిన్గా నటిస్తోంది. రూ. 125 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను ఛార్మి, ప్రముఖ హిందీ నిర్మాత కరణ్ జోహార్‌తో కలిసి నిర్మిస్తున్నారు.
A Film that took my everything.
As a performance, Mentally, physically my most challenging role.I give you everything!
Coming Soon#LIGER pic.twitter.com/ljyhK7b1e1— Vijay Deverakonda (@TheDeverakonda) July 2, 2022