Vijay Devarakonda | రౌడీ హీరో విజయ్ దేవరకొండకి ఈ మధ్య సక్సెస్ రేటు చాలా తక్కువగా ఉంది. వైవిధ్యమైన సినిమాలు చేస్తున్నా కూడా ఎందుకో సక్సెస్ అనేది రావడం లేదు. ‘పెళ్లి చుపులు’, ‘అర్జున్ రెడ్డి’ సినిమాలతో రాత్రికి రాత్రి స్టార్డమ్ సాధించిన విజయ్, ఆ తర్వాత గీతా గోవిందంతో అలరించాడు. ఆ తర్వాత విజయ్ చేసిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. అయితే సినిమాల సంగతి ఎలా ఉన్నా కూడా విజయ్ దేవరకొండ తన స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్ డెలివరీ, ఎమోషనల్ డెప్త్‌తో అందరినీ మెస్మరైజ్ చేస్తాడు. విజయ్ దేవరకొండ నటించిన ‘లైగర్’, ‘ఖుషి’ సినిమాలు ఆశించిన విజయం సాధించకపోయినప్పటికీ, విజయ్ దేవరకొండ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఆయన సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు.
రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం ‘కింగ్డమ్’. జాతీయ అవార్డు గ్రహీత దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో విజయ్ సరసన యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తున్నారు. ఇటీవల కాలంలో విజయ్ దేవరకొండ నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర తీవ్రంగా నిరాశపరచడంతో ఈ సినిమాతో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే విజయ్ దేవరకొండకి సంబంధించిన పాత వీడియో ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తుంది. ఇందులో యాంకర్.. కొంత మంది హీరోయిన్ పేర్లు చెబుతాను, వారిని చూస్తే ఏ ఫుడ్ గుర్తుకు వస్తుందో చెప్పమని అంటారు.
అప్పుడు జాన్వీ ఫొటో చూడగానే లడ్డు అని అన్నాడు. సారా అలీఖాన్ని చూపించగానే కుర్కురే అని అన్నాడు. అనన్య ఫొటో చూపించడంతో పాప్సికల్స్ అని విజయ్ అంటాడు. అయితే యాంకర్ ఏ ఫ్లేవర్ అని అడుగుతుంది. వెనీల్ అని చెబుతూ నాకెందుకో తనని చూసినప్పుడల్లా బుగ్గమీద కిస్ చేయాలని అనిపిస్తుందని అంటాడు. అప్పుడు అనన్య..ఓకే యాకెన్ అంటుంది. ఇక రౌడీ ఆమె బుగ్గమీద ముద్దు ఇస్తాడు. ప్రస్తతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియో లైగర్ సినిమా ప్రమోషన్ సమయం నాటిది అయి ఉంటుంది అని అంటున్నారు. ఈ ఇద్దరు లైగర్‌లో కలిసి నటించగా, మూవీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. అయితే ఈ వీడియో చూసి రష్మిక ఎలా ఫీల్ అయిందో అని ముచ్చటించుకుంటున్నారు. కాగా, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా- స్టార్ హీరో విజయ్ దేవరకొండ ప్రేమలో ఉన్నారంటూ కొంతకాలంగా ప్రచారం సాగుతోంది.