Vijay Devarakonda | రౌడీ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘కింగ్డమ్’. ఈ సినిమాకు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తుండగా.. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం జూలై 31న ప్రపంచవ్యాప్తంగా తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా వరుసగా ప్రమోషన్స్ నిర్వహిస్తుంది చిత్రయూనిట్. ఇప్పటికే కింగ్డమ్ బాయ్స్ (Kingdom Boys) అంటూ దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో పాటు విజయ్ దేవరకొండ, సందీప్ రెడ్డి వంగా కలిసి ఒక పాడ్ కాస్ట్‌ని విడుదల చేయగా ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇదిలావుంటే తాజాగా ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్.