VD 12 Teaser – Kingdom | రౌడీ హీరో విజయ్ దేవరకొండ, జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి(Gautham Tinnanuri) కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ‘వీడీ12’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ ప్రాజెక్ట్ రానుండగా సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. భాగ్య శ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం సమ్మర్ కానుకగా మే 30న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా మూవీ నుంచి టైటిల్‌తో పాటు టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ సినిమాకు (Kingdom) అనే టైటిల్ పెట్టినట్లు సితార ఎంటర్టైనమెంట్స్ ప్రకటించింది. ఇక తెలుగు టీజర్‌కి ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇవ్వగా.. తమిళ టీజర్‌కి సూర్య, హిందీ వెర్షన్‌కి రణబీర్ కపూర్ వాయిస్ ఓవర్‌ని అందించాడు.
అలసట లేని భీకర యుద్ధం. అలలుగా పారే వీరుల రక్తం. వలసపోయిన.. అలసిపోయిన ఆగిపోనిది ఈ మహా రణం. నేలపైన దండయాత్రలు.. మట్టికిందా మృతదేహాలు. ఈ అలజడి ఎవరికోసం ఇంత బీభత్సం ఎవరికోసం. అసలు ఈ వినాశనం ఎవరికోసం.. రణభూమిని చీల్చుకోని పుట్టే కొత్త రాజు కోసం. అంటూ ఎన్టీఆర్ వాయిస్‌తో వచ్చిన ఈ టీజర్ ఫుల్ యాక్షన్ ప్యాక్డ్గా సాగింది. పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా రాబోతుండగా.. అణచివేయబడుతున్న ప్రజలకోసం విజయ్ నాయకుడిగా నిలబడినట్లు టీజర్ చూస్తే అర్థమవుతుంది.