Vijay Devarakonda | రౌడీ హీరో విజయ్ దేవరకొండకి హిట్ రాక చాలా రోజులు అవుతుంది. ఎలాంటి సినిమా చేసిన కూడా ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడుతుంది. అయితే ఈ సారి హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు విజయ్. ప్రస్తుతం విజయ్ దేవరకొండ..గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తోన్న కింగ్డమ్ అనే చిత్రం చేస్తున్నాడు. ఇందులో భాగ్యశ్రీ బోర్సేకథానాయికగా నటిస్తుంది. సితార ఎంటర్ట్మైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ బ్యానర్స్ ఈ మూవీని నిర్మిస్తున్నాయి. ఆ మధ్య ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో వచ్చిన టీజర్, రీసెంట్ గా వచ్చిన పాట మూవీపై అంచనాలను పెంచింది. జూలై 4న చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి.కాని మూవీ వాయిదా పడే ఛాన్స్ ఉందని అంటున్నారు.
విజయ్ దేవరకొండ కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా రూపొందుతున్న కింగ్ డమ్ విడుదల దగ్గరపడుతుంది. అయితే ఇటీవలే ఫైనల్ కట్ చూసిన దర్శకుడు గౌతమ్ తిన్ననూరి కొన్ని సన్నివేశాలను రీ షూట్ చేయాలని భావించడంతో ఇప్పుడు రీషూట్ గోవాలో జరుగుతున్నట్టు తెలుస్తుంది. దీనిపై అఫీషియల్ ప్రకటన రాలేదు కాని దీని మీద వర్క్ జరుగుతోందట. ఇది కాగానే బ్యాలన్స్ ఉన్న పోస్ట్ ప్రొడక్షన్ ని ఫినిష్ చేసి అనిరుద్ రవిచందర్ రీ రికార్డింగ్ కోసం ఫైనల్ కాపీ ఇవ్వాల్సి ఉంటుంది. సమయం లేకపోవడంతో టీమ్ పరుగులు పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. మరి చెప్పిన టైం వరకు మూవీని కంప్లీట్ చేసి రిలీజ్ చేస్తారా, లేదంటే పోస్ట్ పోన్ చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది.
ఇక కెరీర్ లో ఎప్పుడు లేనట్టుగా సరికొత్త పాత్రలో విజయ్ దేవరకొండ ఈ చిత్రంలో కనిపించనున్నారు.ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడం విజయ్ దేవరకొండకు చాలా కీలకం. ఎందుకంటే ఆయన నటించిన గత చిత్రాలు లైగర్, ది ఫ్యామిలీ స్టార్ వరసగా నిరాశ పరిచాయి. అయినా సరే బడ్జెట్ విషయంలో కాంప్రమైజ్ లేకుండా సితార, ఎస్విసి, మైత్రి లాంటి పెద్ద బ్యానర్లు విజయ్ దేవరకొండతో పెద్ద ప్రయోగమే చేస్తున్నాయి. శ్రీలంక శరణార్ధుల బ్యాక్ డ్రాప్ లో రూపొందిన కింగ్ డమ్ లో అణిచివేతకు గురవుతున్న వాళ్ళను కాపాడేందుకు వచ్చే నాయకుడిగా విజయ్ పాత్ర చాలా ఇంటెన్స్ గా ఉంటుందని తెలుస్తుంది.