Vijay devarakonda | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్‌తో పాటు మూవీ లవర్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం కల్కి. ఈ సినిమా జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదలకు ఇంకా 5 రోజులే ఉండడంతో ప్రమోషన్స్ గట్టిగా చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే టీజర్‌తో పాటు ట్రైలర్లు విడుదల చేయగా ఆకట్టుకున్నాయి.
ఇదిలావుంటే శుక్రవారం రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ యూట్యూబ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. అయితే ఈ కొత్త ట్రైలర్లో మాళవికనాయర్ను చూపించి సర్ప్రైజ్ ఇచ్చారు మేకర్స్. ఇప్పుడు తాజాగా ఈ మూవీకి సంబంధించి ఒక సాలిడ్ రూమర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమాలో రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ నటిస్తున్నట్లు తెలుస్తుంది. అశ్వథామ(కుంజరం)ను ఎదుర్కోనే పాత్రలో విజయ్ కనిపించబోతున్నట్లు నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి. దీనిపై మేకర్స్ ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు.