Vijay Devarakonda | జయాపజయాలకు అతీతమైన ఇమేజ్ విజయ్ దేవరకొండది. ప్రస్తుతం ఆయన గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్నది.
ఇటీవలే శ్రీలంకలో భారీ షెడ్యూల్‌ని పూర్తి చేసుకుని చిత్రబృందం హైదరాబాద్ చేరుకుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్‌ని మొదలుపెట్టారు. ఇదిలావుంటే.. ఈ సినిమా విషయంలో ఓ ఆసక్తికరమైన అప్డేట్ ఒకటి వెలుగు చూసింది. ఇందులో విజయ్ దేవరకొండ కానిస్టేబుల్‌గా, ఖైదీగా రెండు రకాలుగా కనిపించనున్నారట. ఇందుకోసం ఆయన ప్రత్యేకమైన ఓ లుక్‌ని కూడా సెట్ చేసుకున్నారట.
ఇందులో విజయ్ దేవరకొండ నటవిశ్వరూపాన్ని చూస్తారని చిత్రబృందం చెబుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 75శాతం పూర్తయింది. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చిలో విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకి సంగీతం: అనిరుధ్.