Vijay Devarakonda | కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో కార్తీక్ సుబ్బరాజు తెరకెక్కించిన చిత్రం ‘రెట్రో’. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటించింది. మే 1న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుండగా, తెలుగులో ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ రిలీజ్ చేస్తున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో మేకర్స్ ప్రమోషన్ స్పీడ్ పెంచారు. శనివారం హైదరాబాద్ లోని జేఆర్సీ కన్వెన్షన్ లో గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించగా, ఈ కార్యక్రమానికి టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ చీఫ్ గెస్టుగా హాజరయ్యారు. ఈ క్రమంలో విజయ్ దేవరకొండని యాంకర్ సుమ ఒక ఆసక్తికర ప్రశ్న అడిగింది. టైమ్ మెషిన్ సహాయంతో రెట్రో రోజుల్లోకి వెళ్తే మీరు ఎవరిని కలుస్తారు అని ప్రశ్నించింది.
దానికి విజయ్ దేవరకొండ స్పందిస్తూ.. బ్రిటీష్ వాళ్లని కలిసి రెండు పీకాలని అయితే ఉంది. ఛావా సినిమా చూశాక కోపం మాములుగా రాలేదు. ఇక ఔరంగజేబు గాడిని గట్టిగా రెండు మూడు వేసుకోవాలని ఉంది. అలా చాలామందిని కలవాలని ఉంది. మంచోళ్ళను ఇబ్బంది పెట్టినవారిని కొట్టాలని అనిపిస్తుంది అని అన్నారు.ఇటీవల కాశ్మీర్లో చాలా జరుగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. ప్రాపర్ ఎడ్యుకేషన్ లేక వారు అలా బిహేవ్ చేస్తున్నారు. ఆ నా కొడుకులకి ప్రాపర్‌గా ఎడ్యుకేషన్ చెప్పించి. ఇలా బ్రెయిన్ వాష్ కాకుండా ఏం సాధిస్తారు, ఇలా చేయడం అనేది నేర్పించాలి.
ఇప్పుడు నేను చెబుతున్నాను. కాశ్మీర్ ఇండియాదే. వాళ్లు ఇండియన్స్. రెండేళ్ల క్రితం ఖుషీ సినిమా కోసం అక్కడికి వెళ్లినప్పుడు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. మంచి మెమోరీస్ ఉన్నాయి. పాక్ వాళ్లు వాళ్ల మనుషులని చూసుకోలేకపోతున్నారు. కరెంట్ కూడా లేదు. ఇండియా పాకిస్తాన్ మీద అటాక్ చేయాల్సిన పని లేదు. వాళ్లకే విరక్తి వచ్చి వాళ్ల గవర్నమెంట్పైన అటాక్ చేసే రోజు తప్పక వస్తుంది. ఇలానే కంటిన్యూ అయితే కచ్చితంగా అది జరుగుతుంది అంటూ విజయ్ దేవరకొండ కాశ్మీర్ ఇష్యూపై సీరియస్ అయ్యారు. ఇక 15 ఏళ్ల తర్వాత సూర్యతో స్టేజ్ పంచుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు.