విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న సినిమా ‘లైగర్’. ఈ చిత్రంలో ఆయన మిక్స్ మార్షల్ ఆర్ట్ ఫైటర్గా కనిపించబోతున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్గా దర్శకుడు పూరి జగన్నాథ్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అనన్య పాండే నాయికగా నటిస్తున్నది. పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ పతాకాలపై పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహార్, అపూర్వ మెహతా నిర్మిస్తున్నారు. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా ఆగస్టు 25న విడుదల కాబోతున్నది. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘అక్టీ పక్డీ..’ని ఈ నెల 11న విడుదల చేయబోతున్నారు. ఈ పాట పోస్టర్ను బుధవారం రివీల్ చేశారు. పబ్లో సాగే పార్టీ సాంగ్గా ఈ పాట ఉండనుంది. లిజో జార్జ్ డీజే చేతాస్ స్వరపర్చిన ఈ పాటకు భాస్కరభట్ల రవికుమార్ సాహిత్యాన్ని అందించగా..అనురాగ్ కులకర్ణి, రమ్య బెహరా పాడారు. సినిమాకు ఈ పాట హుషారు తీసుకొస్తుందని చిత్రబృందం చెబుతున్నారు. రమ్యకృష్ణ, మైక్ టైసన్, రోనీ రాయ్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.