ఇటీవలే ‘కింగ్డమ్’తో ఆడియన్స్‌ని పలకరించారు అగ్ర హీరో విజయ్ దేవరకొండ. ప్రస్తుతం రాహుల్ సంకృత్యాన్‌తో సినిమా చేస్తున్నారాయన. ఈ సినిమా తర్వాత రవికిరణ్ కోలా దర్శకత్వంలో సినిమా ఉంటుంది. మొత్తంగా క్షణం తీరిక లేకుండా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు విజయ్ దేవరకొండ. ఇదిలావుంటే.. ఆయన డైరీలోకి మరో క్రేజీ మూవీ వచ్చి చేరింది.
విజయ్‌తో ‘కింగ్డమ్’ చిత్రాన్ని నిర్మించిన హారిక-హాసిని సంస్థ నిర్మించనున్న ఈచిత్రానికి హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తారట. విజయ్ కోసం అద్భుతమైన కథను సిద్ధం చేశారట హరీశ్ శంకర్. విజయ్ ప్రస్తుత కమిట్మెంట్లు పూర్తవ్వగానే ఈ సినిమా సెట్స్‌కి వెళుతుందని సమాచారం. ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ షూటింగ్లో హరీశ్‌శంకర్ బిజీగా ఉన్నారు. ఈ సినిమా పని పూర్తయ్యాక.. విజయ్ సినిమా స్క్రిప్ట్ పని మొదలుపెడతారట.