VD13 Movie | లైగర్ వంటి డిజాస్టర్ తర్వాత విజయ్‌కు ఖుషీ సినిమా కాస్త ఊరటనిచ్చింది. ప్రస్తుతం అదే జోష్‌తో పరుశురాంతో ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేస్తున్నాడు. గీతా గోవిందం తర్వాత వీళ్ల కాంబోలో సినిమా తెరకెక్కనుండటంతో ఈ మూవీపై ఆడియెన్స్‌లో మంచి బజ్ ఏర్పడింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇక ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ను మేకర్స్ ప్రకటించారు.
ఈ సినిమా టైటిల్‌ను అక్టోబర్ 18న సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు రివీల్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ క్రమంలో ఓ స్పెషల్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేసింది. అందులో స్కూల్ డ్రెస్‌లో ఉన్న పిల్లల చేయి పట్టుకుని ముందుకు నడుస్తున్నట్లున్న లుక్‌ను అభిమానులతో పంచుకున్నారు. ఈ సినిమా కూడా గీత గోవిందం తరహాలోనే హీరో క్యారెక్టర్ బలంగా వుంటూనే, అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్తో సాగుతుందట. ఈ సినిమాలో సీతారామం బ్యూటీ మృనాళ్ థాకూర్ విజయకు జోడీగా నటిస్తుంది.
ఐదేళ్ల కిందట వీళ్ల కాంబోలో వచ్చిన ‘గీతా గోవిందం’ బాక్సాఫీస్ దగ్గర సృష్టించిన రికార్డులు అంతా ఇంతా కాదు. పెట్టిన బడ్జెట్‌కు పదింతలు కలెక్ట్ చేసి నిర్మాత పాలిట కామధేనువులా కాసులు వర్షం కురిపించింది. ఇప్పటికీ మీడియం బడ్జెట్ సినిమాల్లో అత్యధిక ప్రాఫిట్స్ తెచ్చిపెట్టిన సినిమాగా ఇదే ఉంది. అంతకు ముందు వచ్చిన ‘అర్జున్ రెడ్డి’లో యాంగర్ మేనేజ్మెంట్ పాత్ర పోషించిన విజయ్.. ఉన్నట్టుండి గీతాగోవిందం కోసం ఇన్నోసెంట్ పాత్రలో కనిపించడం ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. అంతేకాదండోయ్.. రష్మిక, విజయ్‌ల కెమిస్ట్రీకు కూడా పట్టం కట్టారు. ఈ సినిమాతో పరుశురామ్ పేరు ఇండస్ట్రీలో మార్మోగిపోయింది.