మల్టీ టాలెంటెడ్ హీరో విజయ్ ఆంటోని నటించిన మర్డర్ మిస్టరీ క్రై థ్రిల్లర్ ‘మార్గన్’. విజయ్ ఆంటోని ఫిల్మ్స్ కార్పొరేషన్ నిర్మించిన ఈ చిత్రానికి లియో జాన్పాల్ దర్శకుడు. జూన్ 27న సినిమా విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో బుధవారం హైదరాబాద్లో జరిగింది. ‘గొప్ప ఎడిటర్ అయిన లియో జాన్పాల్ ఈ కథ చెప్పిన విధానం నాకు నచ్చింది. ఇదొక సూపర్ నాచురల్ థ్రిల్లర్. ప్రేక్షకుల్ని ఉత్కంఠకు గురిచేసే అంశాలు ఇందులో మెండుగా ఉంటాయి. తప్పకుండా అందరికీ నచ్చే సినిమా అవుతుంది’ అని విజయ్ ఆంటోని నమ్మకం వెలిబుచ్చారు.
విజయ్ ఆంటోని గొప్ప సంగీత దర్శకుడన్న విషయం తెలిసిందే. అలాగే ఆయన గొప్ప దర్శకుడు. గొప్ప ఎడిటర్ కూడా. అన్నింటికీ మించి గొప్ప నిర్మాత. అందుకే ఆయన నేతృత్వంలో తేలిగ్గా ఈ సినిమా చేయగలిగాను. ఈ సినిమాకోసం చాలా ఖర్చు పెట్టాం. ఇందులో అండర్ వాటర్ సీక్వెన్స్ హైలైట్గా ఉంటాయి. దానికోసం ఎంతో కష్టపడ్డాం. విజయ్ ఆంటోని తన పాత్రకు వందశాతం న్యాయం చేశారు. ఓ అద్భుతమైన అనుభూతినిచ్చే సినిమా ఇది.’ అని దర్శకుడు లియో జాన్పాన్ చెప్పారు. ఇంకా సమర్పకుడు జె.రామాంజనేయలు, ప్రధాన పాత్రధారులు అజయ్ ధీషన్, దీప్శిఖ, బ్రిగిడా కూడా మాట్లాడారు. ఈ చిత్రానికి కెమెరా: యువ ఎస్..