విజయ్ ఆంటోని హీరోగా నటిస్తున్న మర్డర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ ‘గగన మార్గన్’. లియో జాన్ పాల్ దర్శకుడు. విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పొరేషన్ నిర్మిస్తున్నది. ఈ సినిమా టైటిల్ను ఇటీవలే రివీల్ చేశారు. ఈ సందర్భంగా కొత్త పోస్టర్ను విడుదల చేశారు. డిటెక్టివ్ ఫిక్షన్ కథాంశమిది. మర్డర్ మిస్టరీ నేపథ్యంలో ఆద్యంతం ఉత్కంఠను పంచుతుంది. విజయ్ ఆంటోని పాత్ర కొత్త పంథాలో ఉంటుంది. నీటి అడుగుభాగాన చిత్రీకరించిన సన్నివేశాలు, విజువల్ ఎఫెక్ట్స్ ప్రధానాకర్షణగా నిలుస్తాయి’ అన్నారు. ఈ చిత్రానికి రచన-దర్శకత్వం: లియోజాన్ పాల్.