‘దర్శకుడు అరుణ్ ప్రభు అద్భుతమైన కథ రాసుకున్నారు. దాన్ని అంతే అద్భుతంగా తెరకెక్కించారు. ఆయనతో వర్క్ చేయడం అదృష్టంగా భావిస్తున్నా. నా అభిప్రాయం ప్రకారం ఇండియాలో టాప్‌టెన్ డైరెక్టర్స్‌లో తను ఒకరు. చాలా టాలెంటెడ్ పర్సన్. ఆ ప్రతిభను మీరు తెరపై చూస్తారు.’ అని విజయ్ ఆంటోని అన్నారు. ఆయన కథానాయకుడిగా రూపొందిన పొలిటికల్ థ్రిల్లర్ ‘భద్రకాళి’. ఇది ఆయన 25వ చిత్రం కావడం విశేషం. అరుణ్‌ప్రభు దర్శకుడు. రామాంజనేయులు జవ్వాజి నిర్మాత. ఈ నెల 19న సినిమా విడుదల కానుంది.
ఏషియన్ సురేశ్ ఎంటైర్టెన్మెంట్, రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా కలిసి ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నాయి. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్లో విజయ్ ఆంటోని మాట్లాడారు. ‘ఇది మంచి పొలిటిక్ థ్రిల్లర్. ఏ రాష్ర్టానికో దేశానికో సంబంధించిన పాలిటిక్స్ ఇందులో ఉండవ్. ఇది పీపుల్ పాలిటిక్స్. అందరికీ రిలేట్ అయ్యేలా ఉంటుంది. మీ అందరి అంచనాలనూ ‘భద్రకాళి’ అందుకుంటుంది.’ అని దర్శకుడు నమ్మకం వెలిబుచ్చారు. దర్శకుడు అరుణ్ సమాజంలోని కీలకమైన అంశాలను సందేశాత్మకంగా ఈ కథలో డీల్ చేశారని నిర్మాత రామాంజనేయులు అన్నారు. ఇంకా అగ్ర నిర్మాత డి.సురేశ్‌బాబు, కథానాయిక తృప్తి రవీంద్ర, రైటర్ భాషశ్రీ కూడా మాట్లాడారు.