Vijay Antony | తమిళ సినీ నటుడు, ‘బిచ్చగాడు’ ఫేమ్ విజయ్ ఆంటోని ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన పెద్ద కుమార్తె మీరా ఆంటోని (16) చెన్నైలోని స్వగృహంలో ఆత్మహత్య చేసుకుంది. మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు తన గదిలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. మీరా చెన్నైలోని ఓ ప్రైవేట్ కళాశాలలో 12వ తరగతి చదువుతున్నది.
మీరా గత కొన్నేళ్లుగా డిప్రెషన్‌తో బాధపడుతూ చికిత్స తీసుకుంటున్నట్లు తెలిసింది. విజయ్ ఆంటోని, నిర్మాత ఫాతిమా 2006లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు ఆడపిల్లలున్నారు. వారిలో పెద్ద కుమార్తె అయిన మీరా బలవన్మరణానికి పాల్పడటంతో విజయ్ ఆంటోని కుటుంబం విషాదంలో మునిగిపోయింది.