నటి రష్మిక మందన్నకు ఎక్కడికెళ్లినా నిశ్చితార్థపు సెగ మాత్రం వదలడం లేదు. రీసెంట్గా అగ్ర హీరో విజయ్ దేవరకొండతో ఆమె నిశ్చితార్థం జరిగిందంటూ కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే.. విజయ్ కానీ, రష్మిక కానీ ఈ విషయంపై ఇప్పటివరకూ క్లారిటీ ఇవ్వలేదు. రీసెంట్గా ‘ది గర్ల్‌ఫ్రెండ్’ ప్రమోషన్లో భాగంగా ఓ అభిమాని రష్మికను నేరుగా అడిగేశాడు. ‘విజయ్‌తో మీ నిశ్చితార్థం జరిగిందంటకదా?’ అని అతడు అడిగిన ప్రశ్నకు నవ్వుతూ తనదైన శైలిలో సమాధానమిచ్చారు రష్మిక మందన్న.
‘ఈ విషయంపై ఎప్పుడు చెప్పాలో అప్పుడే చెబుతాను. అయితే.. ఇందులో మీకు ఏమనిపిస్తుందో అదే నిజం..’ అంటూ రష్మిక నవ్వేశారు. విజయ్‌తో తాను కలిసి నటించిన ‘డియర్ కామ్రెడ్’ గురించి చెబుతూ ‘ఆ సినిమా మాఇద్దరికీ చాలా ప్రత్యేకమైనది. అందరం కష్టపడ్డా సరైన ఫలితం మాత్రం రాలేదు. ఆ సమయంలో ఆదరించకుండా, ఇప్పుడు ప్రశంసిస్తే బాధగా ఉంటుంది.’ అని తెలిపారు రష్మిక