Superstar Rajinikanth Praises New TN CM | తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సరికొత్త సంచలనం సృష్టిస్తూ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన విజయ్ విజయంపై సూపర్ స్టార్ రజనీకాంత్ తాజాగా స్పందించాడు. విజయ్ సాధించిన ఈ అఖండ విజయం తనకెంతో ఆశ్చర్యంతో పాటు అమితమైన ఆనందాన్ని ఇచ్చిందని రజనీకాంత్ పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీతో పాటు తమిళనాడులోని రెండు ప్రధాన ద్రావిడ పార్టీలను ఒంటరిగా ఎదుర్కొని, స్వతంత్రంగా విజయం సాధించడం ద్వారా విజయ్ సాధించిన ఘనత.. గతంలో దిగ్గజాలు ఎంజీఆర్ (MGR), ఎన్టీఆర్ (NTR) సాధించిన విజయాల కంటే చాలా పెద్దదని రజనీకాంత్ కొనియాడారు. కేవలం 52 ఏళ్ల వయసులోనే విజయ్ ఈ స్థాయి విజయాన్ని అందుకోవడం విశేషమని, పైగా సినీ రంగానికి చెందిన వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం తనకు ఎంతో గర్వకారణంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు.