Nayanathara | లేడి సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఆనతి కాలంలోనే స్టార్ హీరోయిన్గా మంచి ఫేమ్ సంపాదించుకున్న ఈ భామ ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజక్ట్స్ చేస్తుంది. అనీల్ రావిపూడి- చిరంజీవి ప్రాజెక్ట్‌లో నయనతారని కథానాయికగా అనుకున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఇక నయనతార సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా ఫ్యామిలీ తప్పక కొంత సమయం కేటాయిస్తుంది. నయనతారకు ఇప్పటికే కవల మగ బిడ్డలు ఉండగా, వారితో సరదాగా గడుపుతుంది. అప్పుడప్పుడు పిల్లలకి సంబంధించిన క్యూట్ పిక్స్ కూడా షేర్ చేస్తుంది.
తాజాగా నయనతార తన సోషల్ మీడియాలో పిల్లలకి సంబంధించిన క్యూట్ పిక్ షేర్ చేసింది. తన పిల్లలు రెయిన్‌బోను చూస్తుండగా, ఆ సమయంలో ఫొటో తీసి ఫస్ట్ రెయిన్ బో అనే క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం నయనతార పిల్లల ఫొటోలు ఇంటర్నెట్‌ని షేక్ చేస్తున్నాయి. ఇక సౌత్ ఇండియన్ క్యూట్ కపుల్స్ లో నయనతార జోడీ ఒకటి. విగ్నేష్ శివన్‌ని ప్రేమించి పెళ్లాడిన నయన్… పెళ్లయ్యాక కూడా ప్రొఫెషనల్ కెరీర్ కంటిన్యూ చేస్తున్నారు. మరోవైపు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నారు.
నయనతార గతంలో ప్రభుదేవా, శింబుతో ప్రేమాయణం నడిపింది. ఆ తర్వాత వారికి బ్రేకప్ చెప్పిన ఈ ముద్దుగుమ్మదాదాపు ఏడేళ్లపాటు విఘ్నేష్ శివన్‌తో ప్రేమాయణం నడిపింది.. 2022 జూన్ 9న కుటుంబ సభ్యులందరి సమక్షంలో పెళ్లి చేసుకోగా, ఆ తర్వాత ఈ ఇద్దరి సీక్రెట్ డేటింగ్ తాలూకు ఎన్నో విషయాలు వైరల్ అయ్యాయి. ఆ తర్వాత ఇద్దరు కవల పిల్లలకు తల్లిదండ్రులయ్యారు నయన్- విగ్నేష్. అన్యూన్యంగా దాంపత్య జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఒక్కోసారి ఈ జంట వివాదాలతో కూడా హాట్ టాపిక్‌గా నిలుస్తున్నారు.