Nayanathara – Vignesh Shivan | లేడి సూపర్ స్టార్ నయనతార తమిళ అగ్ర కథానాయకుడు ధనుష్‌ల మధ్య వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. నయనతార పెళ్లితో పాటు ఆమె జర్నీకి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ (Nayanthara: Beyond The Fairy Tale) అనే డాక్యుమెంటరీని రూపొందించింది. ఈ డాక్యుమెంటరీ ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
అయితే, ఈ డాక్యుమెంటరీలో ధనుష్ నిర్మాతగా వ్యవహరించిన ‘నేనూ రౌడీనే’ మూవీ షూటింగ్ క్లిప్పింగ్స్‌ని వాడుకున్నారు. ఆ క్లిప్పింగ్‌ను డాక్యుమెంటరీలో వాడుకునేందుకు అనుమతి లేకపోవడంతో రూ.10కోట్ల పరిహారం ఇవ్వాలని ధనుష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు నయనతారకు లీగల్ నోటీసులు కూడా పంపారు. ఈ క్రమంలోనే ధనుష్‌ని లక్ష్యంగా చేసుకొని నయనతార ఓ బహిరంగ లేఖను విడుదల చేసింది. చట్టపరంగా తేల్చుకుంటానని తేల్చి చెప్పింది. ప్రస్తుతం ఈ వ్యవహారం తమిళ చిత్ర పరిశ్రమలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే ధనుష్ కోర్టును ఆశ్రయించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
అయితే ఈ విషయంపై ఇప్పటికే కోలీవుడ్ రెండు గ్రూప్‌లుగా విడిపోయి కొందరూ నయన్‌కు సపోర్ట్ చేస్తుండగా మరికొందరు ధనుష్‌కి మద్దతుగా నిలుస్తున్నారు. అయితే ఈ వివాదంకి సంబంధించి ప్రస్తుతం కోర్టులో కేసు విచారణ జరుగుతుండగా.. తాజాగా నయనతార భర్త విఘ్నేశ్ శివన్ సోషల్ మీడియా నుంచి వైదొలిగినట్లు తెలుస్తుంది. రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో పాల్గోన్న నయనతార భర్త విఘ్నేశ్ మాట్లాడుతూ.. అజిత్ సినిమా ఎంతవాడు గాని సినిమా కోసం తాను పాటలు రాశానని.. అయితే అజిత్ నేను రౌడీనే సినిమా చూసి తనను మెచ్చుకున్నారని తెలిపాడు. అయితే నేను రౌడీనే విడుదల కావడానికి ముందే ఎంతవాడు గాని విడుదల కావడంతో అజిత్ ఎలా నీ సినిమా చూస్తాడు అబద్దాలు చెబుతున్నావు అంటూ నెటిజన్లు విఘ్నేశ్ని ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. ధనుష్ తొలి మూవీ చేసే ఛాన్స్ ఇచ్చారనే కనీస కృతజ్ఞత కూడా విఘ్నేశ్‌కి లేదని కామెంట్లు పెడుతున్నారు. దీంతో ఈ గోల భరించని విఘ్నేశ్ సోషల్ మీడియా నుంచి వైదొలిగినట్లు తెలుస్తుంది.