Vidya Vasula Aham Review | ‘విద్య వాసుల అహం’ మూవీ రివ్యూ..
సినిమా పేరు : ‘విద్య వాసుల అహం’
తారాగణం: శివాని రాజశేఖర్, రాహుల్ విజయ్, అవసరాల శ్రీనివాస్, శ్రీనివాస్ రెడ్డి, తనికెళ్ల భరణి
దర్శకత్వం: మణికాంత్ గెల్లి
నిర్మాత: రంజిత్ కుమార్ కొడాలి – నవ్య మహేష్ – చందన కట్ట
విడుదల : మే 17 (ఆహా ఓటీటీ)
Vidya Vasula Aham | కోట బొమ్మాళి పీఎస్ సినిమాతో మంచి హిట్ అందుకున్నారు యువ నటులు శివాని రాజశేఖర్, రాహుల్ విజయ్. అయితే వీళ్లిద్దరు మళ్లీ కలిసి నటించిన తాజా చిత్రం ‘విద్యా వాసుల అహం’ (Vidya Vasula Aham). ఈ చిత్రానికి మణికాంత్ గెల్లి దర్శకత్వం వహించాడు. ఇప్పటికే మూవీ నుంచి ఫస్ట్ లుక్‌తో పాటు టీజర్, ట్రైలర్లు విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. అయితే తాజాగా ఈ చిత్రం నేరుగా ఓటీటీలో విడుదల అయ్యింది. ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ఆహాలో ఈ సినిమా ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతుంది. కొత్తగా పెళ్లయిన జంటల మధ్య ఇగో అడ్డు వచ్చి గోడవలు అయితే ఆ జంట తమ ఇగోని వదిలి కలిసి ఉంటారా.. లేకా అహంతో విడిపోతారా అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. ఇక రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ మూవీ రివ్యూ ఎలా ఉందో చూద్దాం.!
కథ విషయానికి వస్తే.. వైజాగ్‌లో ఉండే విద్య (శివాని), వాసు (రాహుల్ విజయ్)లకు పెళ్లి అంటే పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. ఎప్పుడు పెళ్లి టాపిక్ వచ్చిన దాటవేస్తూ ఉంటారు. అయితే విద్య అనుకోకుండా ఓసారి గుడికి వెళ్లినప్పుడు అక్కడ పెళ్లి గురించి చెప్పిన మాటలు విని పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అవుతుంది. అయితే విద్య (శివానీ రాజశేఖర్) చాలా టిపికల్ అమ్మాయి. తనకు నచ్చిన పెళ్లి కొడుకును సెలెక్ట్ చేయడం కోసం ఒక ఫామ్ రెడీ చేస్తుంది. ఈ అప్లికేషన్‌ను మీకు నచ్చిన వాళ్లందరికీ పంపి వాటిని ఫిల్ చేసి తెప్పించండి, వాళ్లలో ఒకరిని ఫైనల్ చేస్తాను అని పేరెంట్స్ కి చెబుతుంది. అయితే ఈ ఫామ్ వాసు దగ్గరికి కూడా వస్తుంది. ఇక అసలే పెళ్లి అంటే ఇంట్రెస్ట్ లేని వాసు ఈ ఫామ్ చూసి ఇంట్రెస్ట్ గా అనిపించడంతో అమ్మాయి ఎవరో చూడకుండానే ఫిల్ చేసి పంపిస్తాడు. అయితే వాసు అప్లికేషన్ నచ్చి పెళ్లికి ఒకే చెబుతుంది విద్య. అలా వాసుని ఓకే చేయడంతో విద్య, వాసుల పెళ్లి జరుగుతుంది. పెళ్లి తర్వాత కొత్త కాపురం పెట్టిన ఈ జంటకు మొదట్లో అంతా బావుంటుంది. జీవితం సంతోషంగా ముందుకు వెళుతుంది. అయితే సడన్‌గా వీళ్లిద్దరి మధ్య అహం (ఇగో) వలన గొడవలు స్టార్ట్ అవుతాయి. మరి కొత్త జంట మధ్య గొడవ ఎందుకు వచ్చింది? ఎవరి అహం (ఇగో) వలన ఎవరి మనసు నొచ్చుకుంది? మధ్యలో తల్లిదండ్రులు రాకతో ఏం జరిగింది? చివరకు ఎలా ముగింపు ఇచ్చారు అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ : ఇటీవల కాలంలో యువతకి నచ్చే రొమాంటిక్ కామెడీ సినిమాలు చాలా తక్కువగా వస్తున్న విషయం తెలిసిందే. అయితే చాలా రోజుల తర్వాత వచ్చిన మంచి రొమాంటిక్ కామెడీ సినిమా ‘విద్య వాసుల అహం’ అని చెప్పవచ్చు. ఈ మూవీ చుస్తున్నంతా సేపు ప్రేక్షకులకు ఎక్కడ బోర్ కొట్టకుండా చేశాడు దర్శకుడు మణికాంత్ గెల్లి. ప్రస్తుత జనరేషన్లో పెళ్లైన జంటల మధ్య క్యూట్ రిలేషన్ షిప్‌తో పాటు అహం (ఇగో) వలన గొడవలు ఎలా వస్తున్నాయో పర్ఫెక్ట్ గా చూపించారు. స్క్రీన్ ప్లే కూడా కొత్తగా ఉంది. క్లైమాక్స్ కూడా ప్రేక్షకులు సంతృప్తి చెందేలా ఉంది.
నటీనటులు: కోట బొమ్మాళి పీఎస్ సినిమాతో గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన శివాని రాజశేఖర్, రాహుల్ విజయ్ మళ్లీ కలిసి నటించడంతో ప్రేక్షకులు ఈ సినిమాపై ఆసక్తి కనబరిచారు. ఇక శివాని రాజశేఖర్, రాహుల్ విజయ్‌లు ఈ సినిమాను సింగిల్ హ్యాండ్‌తో మోశారు అని చెప్పవచ్చు. రాహుల్ విజయ్ ఈ జనరేషన్ కొత్త పెళ్ళికొడుకుగా మెప్పించగా.. శివాని రాజశేఖర్ ప్రస్తుతం జనరేషన్లో అమ్మాయిలు ఎలా ఆలోచిస్తున్నారో పర్ఫెక్ట్ గా చూపించింది. ఇక అవసరాల శ్రీనివాస్, శ్రీనివాస్ రెడ్డి, తనికెళ్ల భరణి వారి వారి పాత్రల్లో మెప్పించారు.
సాంకేతికంగా : ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. ముఖ్యంగా ఆర్ట్ డిపార్ట్మెంట్ బాగా వర్క్ చేసింది. విద్య వాసుల గృహాన్ని ఆర్ట్ డిపార్ట్మెంట్ చక్కదిద్దిన తీరు, సందర్భానుసారంగా సన్నివేశంలోని మూడ్ కి తగ్గట్లుగా బ్యాగ్రౌండ్ విషయంలో తీసుకున్న జాగ్రత్తలు అభినందనీయం. కళ్యాణ్ మాలిక్ ఇచ్చిన సంగీతం బ్యూటిఫుల్ గా ఉంది. పాటలు కూడా ఒకే అనిపించేలా ఉన్నాయి. దర్శకుడిగా మణికాంత్ 100% సక్సెస్ అయ్యాడు. మొత్తానికి ‘విద్య వాసుల అహం’ మూవీ
ఈ సమ్మర్‌కి పర్ఫెక్ట్ రోమ్ కామ్ అని చెప్పవచ్చు.
రేటింగ్: 2.75/5