రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘విద్య వాసుల అహం’. ‘లాంగ్ లాంగ్ ఇగో స్టోరీ’ ఉపశీర్షిక. మణికాంత్ గెల్లి దర్శకుడు. మహేష్ దత్త, లక్ష్మీ నవ్య మక్కపాటి నిర్మాతలు. ఈ చిత్రం ఈ నెల 17న ‘ఆహా’ ఓటీటీలో విడుదలకానుంది. ఈ సందర్భంగా బుధవారం నిర్వహించిన సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ ‘వాసు, విద్య అనే కొత్త దంపతుల కథ ఇది. వైవాహిక జీవితంలో వారి మధ్య తలెత్తే ఇగో ఇష్యూస్ ఏమిటి? వాటిని వారు ఎలా పరిష్కరించుకున్నారు అన్నది ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. ట్రైలర్‌కు మంచి స్పందన లభిస్తున్నది. ఈ సమ్మర్ సీజన్లో కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా అలరిస్తుంది’ అన్నారు. ఇగోల నేపథ్యంలో సాగే వినోదాత్మక చిత్రమిదని, హాయిగా నవ్వుతూ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చని హీరో రాహుల్ విజయ్ చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: అఖిల్ వల్లూరి, సంగీతం: కల్యాణి మాలిక్, నిర్మాణ సంస్థ: ఎటర్నిటీ ఎంటర్టైన్మెంట్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మణికాంత్ గెల్లి.