Viduthalai Part 2 Trailer | ఇటీవల మహారాజ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు తమిళ కథానాయకుడు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి. ఆయన హీరోగా వస్తున్న తాజా చిత్రం ‘విడుతలై 2’. కోలీవుడ్ స్టార్ దర్శకుడు వెట్రి మారన్ దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం ‘విడుతలై పార్ట్-1’. కమెడియన్ సూరి, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే ఈ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ రానున్న విషయం తెలిసిందే.
విడుదలై పార్ట్ 2 గా రాబోతున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ చివర దశలో ఉంది. ఈ చిత్రానికి లెజెండరీ సంగీత దర్శకుడు ఇళయరాజా సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా మూవీ నుంచి ట్రైలర్‌ను విడుదల చేసింది. ట్రైలర్ చూస్తుంటే.. సెకండ్ పార్ట్‌లో విజయ్ సేతుపతి మావోయిస్ట్‌గా ఎందుకు మారాడు అనేది చూపించబోతున్నట్లు తెలుస్తుంది.