Viduthalai Movie | హీరోల ఇమేజ్‌తో సంబంధంలేకుండా కేవలం కథకు ఏది కావాలో దాన్ని మాత్రమే తెరకెక్కించే తమిళ దర్శకుడు వెట్రిమారన్. ఆయన సినిమాల్లోని హీరో పాత్రకు భారీ ఎలివేషన్లు, యాక్షన్ సీన్లు గట్రా ఏమి ఉండవు. ఎంత పెద్ద స్టార్ అయినా సరే.. కథకు ఏమి కావాలో అది మాత్రమే తీస్తాడు. అందుకేనేమో అవార్డులు సైతం ఆయనకు దాసోహం అవుతుంటాయి. తమిళంలోనే కాకుండా తెలుగులోను వెట్రిమారన్‌కు యమ క్రేజ్ ఉంది. కేవలం పోస్టర్‌పై ఆయన పేరు కనిపిస్తే చాలు ప్రేక్షకులు థియేటర్లకు ఎగబడిపోతుంటారు. ఇక గత ఏడాది ఆయన దర్శకత్వం వహించిన ‘విడుతలై పార్ట్-1’ రిలీజై మంచి విజయం అందుకున్న విషయం తెలిసిందే. దీనికి కొనసాగింపుగా ‘విడుతలై 2’ రాబోతుంది. ప్రస్తుతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.
అయితే ఈ రెండు సినిమాలను తాజాగా ప్రముఖ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ రోటర్ డాం ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించగా.. రోటర్ డాం ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహాకులు ఈ సినిమాలకు 5 నిమిషాల పాటు స్టాండింగ్ ఓవియేషన్ ఇచ్చారు. ఈ విషయాన్ని మేకర్స్ సోషల్ మీడియాలో ప్రకటించారు. కోలీవుడ్ నటుడు కమెడియన్ సూరి ప్రధాన పాత్రలో వచ్చిన ఈ చిత్రంలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి విలన్ రోల్లో నటించాడు. ఇక ఈ చిత్రానికి లెజెండరీ సంగీత దర్శకుడు ఇళయరాజా సంగీతం అందించాడు. విడుదలై పార్ట్ 2 ఎప్పుడు విడుదలవుతుందా అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.
#Viduthalai Part 1 & 2 The film receives a thunderous standing ovation at @IFFR! Powerful 5-minute applause resonates with the impactful storytelling and stellar performances at #RotterdamFilmFestival
An @ilaiyaraaja Musical#VetriMaaran @VijaySethuOffl @sooriofficial… pic.twitter.com/6sGufh6P0f
— GA2 Pictures (@GA2Official) February 1, 2024