రోహిత్నంద, ఆనంది జంటగా నటిస్తున్న చిత్రం ‘విధి’. శ్రీకాంత్ రంగనాథన్, శ్రీనాథ్ రంగనాథన్ దర్శకత్వం వహించారు. రంజిత్ ఎస్ నిర్మాత. నవంబర్ 3న విడుదలకానుంది. ఈ చిత్ర టీజర్‌ను సోమవారం యువ హీరో విశ్వక్సేన్ ఆవిష్కరించారు. దర్శకుడు మాట్లాడుతూ ‘మనం మాటాడటం కంటే మనం తీసే కంటెంట్ మాట్లాడాలి. ఈ సినిమాను ఓ వినూత్నమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కించాం.
ఓ జంట జీవితంలో విధి ఎలాంటి మలుపులకు కారణమైందనేది ఆసక్తికరంగా ఉంటుంది’ అన్నారు. కథాపరంగా ఈ సినిమాలో అనేక ఆసక్తికరమైన అంశాలుంటాయని హీరో రోహిత్ నంద తెలిపాడు. చాలా విరామం తర్వాత తాను నటించిన తెలుగు చిత్రమిదని, కొత్త కాన్సెప్ట్‌తో ఆకట్టుకుంటుందని కథానాయిక ఆనంది చెప్పింది. ఎవరూ ఊహించని కథ, కథనాలతో సర్ప్రైజ్ చేసే చిత్రమిదని నిర్మాత రంజిత్ పేర్కొన్నారు.