ప్రపంచమంతా నిన్ను నమ్మకపోయినా ఫర్వాలేదు. నిన్ను నువ్వు నమ్ముకో.. అనే కాన్సెప్ట్‌తో అజిత్ తమిళంలో నటిస్తున్న యాక్షన్ అడ్వంచర్ ‘విడాముయర్చి’. మగిళ్ తిరుమేని దర్శకుడు. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్స్ దశలో ఉంది. తాజాగా ఈ సినిమా టీజర్‌ని మేకర్స్ విడుదల చేశారు. అజిత్‌ని డిఫరెంట్ మాస్ అవతార్‌ని ఈ టీజర్లో చూడొచ్చు. టీజర్‌ని గమనిస్తే.. అజిత్ దేనికోసమో అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలో విలన్స్ భరతం పడుతున్నారు. తాను సాధించాల్సిన లక్ష్యం కోసం ఏం చేయటానికైనా, ఎంతదూరం వెళ్లటానికైనా వెనుకాడని వ్యక్తిగా ఇందులో అజిత్ కనిపిస్తారని, ‘మంగాత’ తర్వాత మళ్లీ అజిత్, అర్జున్, త్రిష కలిసి నటిస్తున్న ఈ చిత్రం ప్రేక్షకులకు ఓ డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్‌ని ఇస్తుందని మేకర్స్ చెబుతున్నారు. సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ఈ చిత్రంలో ఆరవ్, రెజీనా కసాండ్ర, నిఖిల్ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: ఓంప్రకాష్, సంగీతం: అనిరుద్.