Ajith Kumar Ties Laces Of child Shoes | తమిళ నటుడు అజిత్ ప్రస్తుతం ఫుల్ జోష్‌తో ఉన్నాడు. ఒకవైపు ఆయన నటించిన పట్టుదల (విడాముయర్చి) చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి థియేటర్లో సందడి చేస్తుండగా.. మరోవైపు దుబాయ్‌లో జరిగిన కార్ రేసింగ్ ఈవెంట్లో అజిత్ టీం ముడో స్థానంలో నిలిచింది. అయితే అజిత్ ప్రస్తుతం ప్యూచర్లో జరుగబోతున్న రేసింగ్ పోటీలకోసం సిద్ధమవుతున్నాడు. ఇదిలావుంటే తన రేసింగ్ ప్రాక్టీస్ సెషన్లో అజిత్ చేసిన పని ప్రస్తుతం వైరల్‌గా మారింది.
అజిత్ కార్ రేసింగ్‌లో టీంకు సంబంధించిన వేర్‌హౌస్‌లో ఉన్న ఒక చిన్నారి షూ లేస్ కట్టుకోవడానికి ఇబ్బందిపడుతుండగా.. అజిత్ వచ్చి లేస్ కట్టడంలో సహయం చేస్తాడు. అయితే ఇది చూసిన సిబ్బంది అజిత్‌ని వద్దంటూ వారిస్తారు. దీంతో అక్కడనుంచి వెళ్లిపోతాడు అజిత్. అయితే చిన్నారి షూ లేస్ కట్టడం కోసం ముందుకు వచ్చిన అజిత్‌పై సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి. స్టార్ హీరో అయ్యి షూ లేస్ కట్టడానికి కూడా ఆలోచించలేదు అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. కాగా ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
AK tying the shoe laces of a crew member and caught in a fan camera unaware. Idhellam blood la varadhu. ❤️
#AjithKumar #VidaaMuyarchi pic.twitter.com/iu4waHjgWv
— Trollywood 𝕏 (@TrollywoodX) February 9, 2025