Ajith Pattudala | అజిత్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం విడాముయర్చి (తెలుగులో పట్టుదల). ఈ సినిమాకు మాగిజ్ తిరుమేని దర్శకత్వం వహించగా.. త్రిష, అర్జున్ సర్జా, రెజీనా తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. ఫిబ్రవరి 06న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని అందుకుంది. ఇక థియేటర్లో నిరాశపరిచిన ఈ చిత్రం తాజాగా ఓటీటీ అనౌన్స్మెంట్ని పంచుకుంది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ఫ్లిక్స్లో ఈ చిత్రం మార్చి 03 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
యాక్షన్ ఎంటర్ టైనర్గా వచ్చిన ఈ చిత్రం 1997లో వచ్చిన హాలీవుడ్ చిత్రం “బ్రేక్డౌన్” నుంచి స్ఫూర్తి పొందింది. కథ విషయానికి వస్తే.. అర్జున్(అజిత్), కాయల్ (త్రిష) ప్రేమించి పెళ్లి చేసుకుని 12 ఏండ్లు అన్యోన్యంగా జీవిస్తారు. అయితే అర్జున్ తనను ప్రేమించడం లేదని భావించి మరొక వ్యక్తితో సంబంధం పెట్టుకుంటుంది. ఆమె తన ఎఫైర్ గురించి అర్జున్తో బహిరంగంగా చెప్పి విడాకులు కోరుతుంది. దీంతో కాయల్ నిర్ణయాన్ని గౌరవిస్తూ విడాకులకు ఒకే చెబుతాడు అర్జున్. అయితే విడాకులు రాకముందే తన ఇంటికి వెళ్లాలని అనుకుంటుంది కాయల్. అయితే తానే కారులో తీసుకువెళతానని, అది ఇద్దరికీ గుర్తుండిపోయే ఆఖరి ప్రయాణంలా ఉంటుందని చెబుతాడు అర్జున్. ఈ క్రమంలోనే అజర్బైజాన్లోని బాకు నుంచి ప్రయాణం స్టార్ట్ అవుతుంది. కాయల్ ఇంటికి వెళుతుండగా మధ్యలో కొన్ని అవాంతరాలు ఎదురవ్వడంతో పాటు అనుకోకుండా కాయల్ కనిపించకుండా పోతుంది. అయితే కాయల్ని కిడ్నాప్ చేసింది ఎవరు. ఆమెని వెదుక్కుంటూ వెళ్లిన అర్జున్ ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నాడు అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
Muyarchi thiruvinai aakum. Vidaamuyarchi ulagai vellum 💪🔥
Watch Vidaamuyarchi on Netflix, out 3 March in Tamil, Hindi, Telugu, Kannada & Malayalam!#VidaamuyarchiOnNetflix pic.twitter.com/21OiHpF8AB— Netflix India South (@Netflix_INSouth) February 24, 2025