Venkatesh X Trivikram | ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్న నటుడు విక్టరీ వెంకటేశ్ చాలా రోజుల తర్వాత తన అప్‌కమింగ్ ప్రాజెక్ట్ గురించి అప్డేట్ని ఇచ్చాడు. తన తదుపరి చిత్రం దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో (Trivikram Srinivas) చేయబోతున్నట్లు ప్రకటించాడు. ఇండిపెండెన్స్ డే కానుకగా.. ఈ ప్రాజెక్ట్ నేడు పూజ కార్యక్రామాలు పూర్తి చేసుకుంది. వెంకటేశ్ సోదరుడు సురేష్ బాబు ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేశాడు. ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ నిర్మించనున్నట్లు తెలుస్తోంది. వెంకీ 77 అనే వర్కింగ్ టైటిల్‌తో రాబోతున్న ఈ ప్రాజెక్ట్ త్వరలోనే షూటింగ్‌ను మొదలుపెట్టబోతుండగా ప్రాజెక్ట్‌కి సంబంధించి మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడించనున్నట్లు చిత్రబృందం తెలిపింది.
వెంకటేశ్ నటించిన నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి చిత్రాలకు త్రివిక్రమ్ మాటలు రాశారు. దర్శకుడయ్యాక ఆయన వెంకీతో సినిమా చేస్తారని అందరూ భావించారు. కానీ ఎందుకో ఆ కాంబినేషన్ సెట్ కాలేదు. అయితే.. ఎట్టకేలకు వెంకీ, త్రివిక్రమ్‌ల కాంబినేషన్ సెట్ అవ్వడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు.
#VenkateshXTrivikram
This one is special ❤️#Trivikram #SRadhaKrishna (Chinababu) garu @vamsi84 @haarikahassine #Venky77 pic.twitter.com/CDWYUypmes— Venkatesh Daggubati (@VenkyMama) August 15, 2025