Victory Venkatesh | సంక్రాంతికి ఆల్రెడీ అరడజన్ సినిమాలు ఉండగానే తాజాగా వెంకటేష్ (Daggubati Venkatesh) కూడా వస్తున్నాడు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం సైంధవ్ (Saindhav). ఈ సినిమాను జనవరి 13న రానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. డిసెంబర్ 22న ముందు విడుదల అనుకున్నా కూడా అదే రోజు సలార్ వస్తుండటంతో డేట్ మార్చుకోక తప్పలేదు. హిట్ చిత్రాల ఫేమ్ శైలేష్ కొలను తెరకెక్కిస్తున్న ఈ చిత్రం వెంకటేష్‌కు 75వ చిత్రం కావడంతో అంచనాలు బాగానే ఉన్నాయి. దానికి తోడు భారీ బడ్జెట్‌తో సైంధవ్ వస్తుంది. ఇదిలా ఉండగా.. ఈ సినిమా నుంచి ఒక సాలిడ్ అప్డేట్ వచ్చింది.
తాజాగా ఈ సినిమా నుంచి ఈరోజు సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు ఓ సస్పెన్స్ అప్డేట్ను ఇవ్వబోతున్నట్టు వెంకీ టీం ప్రకటించింది. ఇక సాయంత్రం ఏం ప్రకటించబోతుందంటూ తెగ ఆలోచనలో పడిపోయారు మూవీ లవర్స్.
A BIG UPDATE from Team #SAINDHAV Loading Today at 4:05 PM❤️🔥
Stay Tuned💥#SaindhavOnJAN13th
Victory @VenkyMama @Nawazuddin_S @arya_offl @KolanuSailesh @ShraddhaSrinath @iRuhaniSharma @andrea_jeremiah @Music_Santhosh @NiharikaEnt @vboyanapalli @tkishore555 @maniDop #Venky75 pic.twitter.com/tpgfmEFsvM
— Vamsi Kaka (@vamsikaka) October 12, 2023
చంద్రప్రస్థ ఫిక్షనల్ పోర్ట్ ఏరియా బ్యాక్‌డ్రాప్‌లో సాగే మిషన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న సైంధవ్‌లో జెర్సీ ఫేం శ్రద్ధా శ్రీనాథ్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోండగా.. రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా, బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ, జయప్రకాశ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా నవాజుద్దీన్ సిద్దిఖీ టాలీవుడ్ డెబ్యూ కావడం విశేషం. మేకర్స్ ఇప్పటికే పాత్రలను పరిచయం చేస్తూ విడుదల చేసిన శ్రద్ధా శ్రీనాథ్ మనోజ్ఞ లుక్ నెట్టింట వైరల్ అవుతోంది.
సైంధవ్.. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో 2024 జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ చిత్రాన్ని నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి తెరకెక్కిస్తుండగా.. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు.