Victory Venkatesh | అగ్ర కథానాయకుడు విక్టరీ వెంకటేశ్ తన అప్కమింగ్ సినిమాలకు సంబంధించి సాలిడ్ అప్డేట్ను పంచుకున్నాడు. తాను మెగాస్టార్ చిరంజీవితో పాటు బాలకృష్ణ సినిమాల్లో క్యామియో రోల్స్ చేస్తున్నట్లు తెలిపాడు. ఈ విషయాన్ని అమెరికాలో జరుగుతున్న ‘నాట్స్ 2025’ వేడుకలో వెంకీమామ ప్రకటించాడు.
ఇప్పటికే అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న “మెగా 157” సినిమాలో వెంకటేష్ ఒక క్యామియో రోల్ చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పాత్ర చాలా సరదాగా ఉంటుందని, ప్రేక్షకులకు నవ్వులు పంచుతుందని తెలిపారు. ఇందులో వెంకటేష్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించే అవకాశం ఉందని కూడా వార్తలు వస్తున్నాయి. అయితే దీనితో పాటు బాలయ్య సినిమాలో కూడా నటిస్తున్నట్లు తెలిపాడు. అయితే ఇది కామియో కాకుండా పూర్తిస్థాయి మల్టీస్టారర్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రంకు సంబంధించి మరిన్ని అప్డేట్లు త్వరలోనే రానున్నాయి.
Balayya @VenkyMama combo officially confirmed
Biggest one will be with my friend Balayya #NandamuriBalakrishna #Akhanda2 pic.twitter.com/SVyyG74XP1
— NBK Cult (@iam_NBKCult) July 7, 2025