Harsha Sai | ప్రముఖ యూట్యూబర్ హర్షసాయి కేసులో మరో పరిణామం చోటు చేసుకున్నది. లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన యువతి మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అడ్వకేట్తో కలిసి తనను వేధింపులకు గురి చేస్తున్నట్లు నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. లైంగిక వేధింపుల ఆరోపణలతో ప్రస్తుతం హర్ష సాయి పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. తెలుగు బిగ్బాస్ ఓటీటీలో పాల్గొన్న యువతి హర్షసాయి తనపై పలుసార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని.. పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని.. అలాగే తనను నమ్మించి రూ.2కోట్ల తీసుకొని మోసం చేసినట్లు పోలీసులను ఆశ్రయించిన విషయం తెలిసిందే. దాంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు సెక్షన్ 376, 354, 328 కింద కేసు నమోదు చేశారు. అలాగే, బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించారు. డబ్బుల కోసమే హర్షసాయిపై అక్రమంగా కేసు పెట్టారని అతని తరఫు న్యాయవాది పేర్కొన్నారు. మెగా సినిమా కాపీరైట్ విషయంలో లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఫిర్యాదు చేసింది. తాజాగా మెయిల్స్ పంపుతూ వేధింపులకు గురి చేస్తున్నాడని పోలీసులను ఆశ్రయించింది.