Vicky Kaushal | బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ (Vicky Kaushal) ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘సామ్ బహదూర్’ (Sam Bahadur). ఈ సినిమాకు మేఘనా గుల్జార్ (Meghana Gulzar) దర్శకత్వం వహిస్తుండగా.. రోనీస్క్రూవాలా నిర్మిస్తున్నాడు. సర్దార్ ఉద్దమ్ సినిమా తర్వాత మరో బయోపిక్ సినిమాతో ముందుకువస్తున్నాడు విక్కీ. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్‌తో పాటు టీజర్ విడుదల చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ ట్రైలర్ విడుదల చేశారు. ఇక ఈ ట్రైలర్‌ను భారత మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే(Manoj Pandey) లాంచ్ చేశారు.
ట్రైలర్ చూస్తే.. 1971 ఇండో-పాక్ యుద్ధంలో భారత ఆర్మీ చీఫ్‌గా ఉండి దేశం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన సామ్ మానెక్ షా(Sam Manek Shah) జీవితం ఆధారంగా ఈ మూవీ రానుంది. ఇక సామ్మానెక్షా పాత్రలో విక్కీ కౌశల్ నటిస్తుండగా.. ఇందిరా గాంధీ పాత్రలో సనా ఫాతిమా షేక్ (Sana Fatima Sheikh) నటించింది. ఇక విక్కీ కౌశల్ భార్య పాత్రలో సన్యా మల్హోత్రా నటిస్తుంది. 1971 ఇండో-పాక్ యుద్ధ సమయంలో సామ్మానెక్షా ఎదుర్కొన్న సవాళ్లను ఈ ట్రైలర్లో చూపించారు.
VICKY KAUSHAL: ‘SAM BAHADUR’ TRAILER IS FANTASTIC… And #VickyKaushal proves, yet again, that he’s one of the finest actors of his generation… Director #MeghnaGulzar has raised the expectations multi-fold. #SamBahadur#SamBahadurTrailer… pic.twitter.com/SbqumlRl3z
— taran adarsh (@taran_adarsh) November 8, 2023
ఈ సినిమాలో సామ్మానెక్షా పాత్రలో విక్కీ కౌశల్ సరిగ్గా సరిపోయాడని తెలుస్తుంది. తని బాడీ లాంగ్వేజ్ అండ్ డైలాగ్ డెలివరీ చాలా రియలిస్టిక్ గా కనిపిస్తున్నాయి. ఇక విక్కీ కౌశల్ సైన్యానికి ట్రైనింగ్ ఇచ్చే విధానం, ఇందిరా గాంధీ, సామ్ బహదూర్ మధ్య సీన్స్ టీజర్‌కి హైలైట్ గా నిలిచాయి. ఇక ఈ మూవీ డిసెంబర్ 01న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఫీల్డ్ మార్షల్ సామ్ జంషద్ జీ మానెక్ షా ఇండియన్ ఆర్మీని నాలుగు దశాబ్దాల పాటు ముందుండి నడిపించాడు. బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ నుంచి సైన్యంలోనే ఉన్న ‘మానెక్ షా’, 1971లో ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధంలో ఇండియాని గెలిపించడంలో కీలక పాత్ర పోషించారు. ఇక ‘సామ్ బహదూర్’ని ఇండియన్ గవర్నమెంట్ ‘పద్మ భూషణ్’, ‘పద్మ విభూషణ్’ పురస్కారాలతో సత్కరించింది. 1934 నుంచి 1973 వరకూ ఆర్మీలో తన సేవలు అందించిన ‘సామ్ బహదూర్’ 2008 జూన్ 27న మరణించారు.