Vicky Kaushal | బాలీవుడ్ ప్రామిసింగ్ యాక్టర్ విక్కీ కౌశల్ కెరీర్ బిగెనింగ్ నుంచి కొత్త కథలతో వస్తూ హిందీ నాట మంచి పాపులారిటీ తెచ్చుకున్నాడు. రిజల్ట్ సంగతి ఎలా ఉన్నా.. థియేటర్లకు వెళ్లే ప్రేక్షకులకు కొత్త ఎక్స్‌పీరియెన్స్ ఇవ్వాలని ఎప్పుడూ తాపత్రయపడుతుంటాడు. ఈ మధ్యనే ‘జర హట్కే జర బచ్కే’ సినిమాతో వచ్చి సూపర్ డూపర్ హిట్టు కొట్టాడు. ఇక సర్దార్ ఉద్దమ్ సినిమా తర్వాత ఇప్పుడు అదే జోష్‌తో మరో బయోపిక్ సినిమాతో ముందుకువస్తున్నాడు. విక్కీ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం సామ్ బహదూర్(Sam Bahadur).
1971 ఇండో– పాక్ వార్‌లో బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతుండగా.. ఈ వార్‌లో భారత్ విజయానికి కారణమైన ‘సామ్మానెక్షా’ జీవితం ఆధారంగా ఈ మూవీ రానుంది. ఇక సామ్మానెక్షా పాత్రలో విక్కీ కౌశల్ నటిస్తుండగా.. ఇందిరా గాంధీ పాత్రలో సనా ఫాతిమా షేక్ (Sana Fatima Sheikh) నటించింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి మేకర్స్ ఫస్ట్ లుక్ విడుదల చేయగా.. ప్రేక్షకుల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. తాజాగా ఈ మూవీ నుంచి మేకర్స్ టీజర్ విడుదల చేశారు.
Official Teaser | Vicky Kaushal’s #SamBahadur
In cinemas, 1.12.2023pic.twitter.com/XyXw42MgdD
— LetsCinema (@letscinema) October 13, 2023
ఇక టీజర్ చూస్తే.. సామ్మానెక్షా పాత్రలో విక్కీ కౌశల్ సరిగ్గా సరిపోయాడు. తని బాడీ లాంగ్వేజ్ అండ్ డైలాగ్ డెలివరీ చాలా రియలిస్టిక్ గా కనిపిస్తున్నాయి. ఇక విక్కీ కౌశల్ సైన్యానికి ట్రైనింగ్ ఇచ్చే విధానం, ఇందిరా గాంధీ, సామ్ బహదూర్ మధ్య సీన్స్ టీజర్‌కి హైలైట్ గా నిలిచాయి. ఇక ఈ మూవీ డిసెంబర్ 01న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఫీల్డ్ మార్షల్ సామ్ జంషద్ జీ మానెక్ షా ఇండియన్ ఆర్మీని నాలుగు దశాబ్దాల పాటు ముందుండి నడిపించాడు. బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ నుంచి సైన్యంలోనే ఉన్న ‘మానెక్ షా’, 1971లో ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధంలో ఇండియాని గెలిపించడంలో కీలక పాత్ర పోషించారు. ఇక ‘సామ్ బహదూర్’ని ఇండియన్ గవర్నమెంట్ ‘పద్మ భూషణ్’, ‘పద్మ విభూషణ్’ పురస్కారాలతో సత్కరించింది. 1934 నుంచి 1973 వరకూ ఆర్మీలో తన సేవలు అందించిన ‘సామ్ బహదూర్’ 2008 జూన్ 27న మరణించారు.