Chhaava | బాలీవుడ్ నుంచి వస్తున్న ప్రెస్టిజీయస్ ప్రాజెక్ట్ ఛావా (Chhaava). నటుడు విక్కీ కౌశల్ (Vicky Kaushal) టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ సినిమాకు లక్ష్మణ్ ఉటేకర్(Lakshman Utekar) దర్శకత్వం వహిస్తుండగా.. మడాక్ ఫిల్మ్స్ పతాకం పై దినేశ్ విజన్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.
మహారాష్ట్ర యోధుడు ఛత్రపతి శివాజీ మహరాజ్(Chatrapathi Shivaji Maharaj) పెద్ద కుమారుడు శంభాజీ మహరాజ్(Shambaji MAharaaj) జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా రాబోతుండగా.. రష్మిక మందన్నా(Rashmika MAndanna) కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమా వాలంటైన్స్ డే కానుకగా.. ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ట్రైలర్ను విడుదల చేసింది చిత్రబృందం.
ఛత్రపతి శివాజీ మహరాజ్ మరణానంతరం మరాఠా సామ్రాజ్యానికి రాజుగా నియమితులవుతాడు శివాజీ కుమారుడు శంభాజీ మహరాజ్. అయితే శంభాజీని చంపి మరాఠాను దక్కించుకోవాలని చూస్తాడు మొగల్ చక్రవర్తి ఔరంగజేబు(Mughal Shahenshah Aurangzeb). ఈ క్రమంలోనే ఏం జరిగింది అనేది తెలియాలంటే సినిమా వచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే. చాలా రోజుల తర్వాత బాలీవుడ్ నుంచి హిస్టరీ బ్యాక్డ్రాప్లో సినిమా వస్తుండటంతో భారీ అంచనాలు ఉన్నాయి.