జ్యోతి పూర్వాజ్, రవి, శ్రేయ తివారి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న హారర్ థ్రిల్లర్ ‘విచిత్ర’. స్వీయ నిర్మాణ దర్శకత్వంలో సైఫుద్దీన్ మాలిక్ రూపొందిస్తున్నారు. మే 22న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ తెలిపారు. మదర్ సెంటిమెంట్ ప్రధానంగా సాగే థ్రిల్లర్ చిత్రమిదని, ఫ్యామిలీ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందని దర్శకుడు తెలిపారు. బేబీ హర్షిణి, రవిప్రకాష్, సూర్య, ఛత్రపతి శేఖర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: నిజాని అంజన్, నిర్మాత, దర్శకత్వం: సైఫుద్దీన్ మాలిక్.