Vettaiyan Movie | ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా అంటే అభిమానులకు పండగే. ‘జైలర్’ తర్వాత ఆయన నుంచి వస్తున్న సినిమాగా ‘వేట్టయన్’ అందరిదృష్టిని ఆకర్షించింది. దీంతో పాటు అమితాబ్ బచ్చన్, రానా దగ్గుబాటి, ఫహాద్ ఫాజిల్ లాంటి స్టార్స్ చేరడం మరో ఆకర్షణ. పైగా జైభీమ్ లాంటి అవార్డ్ విన్నింగ్ సినిమా తీసిన జ్ఞానవేల్ నుంచి వస్తున్న సినిమా కావడంతో వేట్టయన్ పై అంచనాలు పెరిగాయి. అయితే దసరా కానుకగా అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. కాగా.. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ లాక్ చేసుకుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా నవంబర్ 8 నుంచి ఇది స్ట్రీమింగ్ కానుంది. తమిళంతోపాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఇది అందుబాటులో ఉండనుంది.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. అథియన్(రజనీకాంత్) ఓ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. తప్పు చేసి చట్టం నుంచి తప్పించుకునే వాళ్ళని తన తూటాలతో శిక్షిస్తుంటాడు. శరణ్య (దుశారా విజయన్) అనే స్కూల్ టీచర్ దారుణంగా హత్యకి గురౌతుంది. ఈ కేసులో ఓ నిందితుడుని పట్టుకుంటారు పోలీసులు. అయితే ఆ నిందితుడు తప్పించుకోవడంతో ప్రభుత్వంపైనా, పోలీసు యంత్రాంగంపైన ఒత్తిడి పెరుగుతుంది. దాంతో అథియన్ రంగంలోకి దిగుతాడు. మరి హంతకుడిని మట్టు బెట్టాడా? ఈ కేసులో అసలు హంతకుడు ఎవరు? ఈ కథలో సత్యదేవ్ (అమితాబ్ బచ్చన్) ప్యాట్రిక్ (ఫహాద్ ఫాజిల్) నటరాజ్ (రానా దగ్గుబాటి ) పాత్రలు ఏమిటి? చివరికి శరణ్యకి న్యాయం జరిగిందా లేదా అనేది కథ.
The date is LOCKED and LOADED for Vettaiyan’s arrival 🔥#VettaiyanOnPrime, Nov 8 pic.twitter.com/xn79iDDfe7
— prime video IN (@PrimeVideoIN) October 31, 2024