Vettaiyan Movie | ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘వెట్టయాన్’(Vettayan). తెలుగులో వేటగాడు (Vetagadu) అని వస్తున్న ఈ సినిమాకు జై భీమ్ ఫేమ్ టి.జె.జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం 2024 దసరా కానుకగా అక్టోబర్ 10న విడుదల కానుంది. అయితే ఈ సినిమా నుంచి ఇప్పటివరకు ఎటువంటి అప్డేట్ ఇవ్వని మేకర్స్ తాజాగా ఫస్ట్ సింగిల్ అప్డేట్ను పంచుకున్నారు.
ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ‘మనసిలాయో’ అనే సాంగ్‌ను సెప్టెంబర్ 9న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఈ సినిమాకు జైలర్ వంటి బ్లాక్ బస్టర్ ఆల్బమ్‌ను అందించిన అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా.. లైకా ప్రోడక్షన్స్ నిర్మిస్తుంది. ఈ పాన్ ఇండియా సినిమా తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది.
Keep your Speakers 🔊 ready! Our Chettan is on the way with a perfect blend of MALTA 🤩 #MANASILAAYO the 1st single 🥁 from VETTAIYAN 🕶️ is dropping on 9th SEPT. 🗓️#Vettaiyan 🕶️ Releasing on 10th October in Tamil, Telugu, Hindi & Kannada!@rajinikanth @SrBachchan @tjgnan… pic.twitter.com/FwZmBGRl0x
— Lyca Productions (@LycaProductions) September 7, 2024
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో మంజు వారియర్, ఫహాద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, రితికా సింగ్, దుషరా విజయన్, రోహిణి, అభిరామి తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.