Bad Girl Teaser | ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న దర్శకుల్లో టాప్‌లో ఉంటారు బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్, కోలీవుడ్ డైరెక్టర్ వెట్రిమారన్ (Vetrimaaran). ఈ ఇద్దరి సమర్పణలో వస్తోన్న తాజా చిత్రం బ్యాడ్‌గర్ల్. అంజలి శివరామన్ (Anjali Sivaraman) లీడ్ రోల్లో నటిస్తోంది.
నాకు ఎప్పుడూ బాయ్‌ఫ్రెండ్ ఉండాలని కోరుకున్నానంటూ అంజలి శివరామన్ (Anjali Sivaraman) చెప్పే సంభాషణలతో మొదలైంది టీజర్. స్కూల్ స్టేజీ నుంచే తోటి విద్యార్థులలాగే తనకు ఓ బాయ్‌ఫ్రెండ్ ఉండాలనుకునే అమ్మాయి కథ నేపథ్యంలో సినిమా ఉండబోతున్నట్టు టీజర్ హింట్ ఇచ్చేస్తుంది. బాయ్‌ఫ్రెండ్ వచ్చిన తర్వాత అమ్మాయి ఎలాంటి వ్యసనాలను బానిసగా మారిపోయిందనేది సినిమాలో చూపించనున్నట్టు టీజర్ చెబుతోంది.
ఏ గ్రాస్ రూట్ ఫిల్మ్ కంపెనీ ప్రొడక్షన్ బ్యానర్‌పై వెట్రిమారన్ తెరకెక్కిస్తున్నారు. అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నాడు. ఆఫ్ ఏజ్ డ్రామా నేపథ్యంలో వస్తోన్న ఈ చిత్రానికి వర్ష భరత్ కథనందిస్తూ దర్శకత్వం వహిస్తున్నాడు. ఆసక్తికరంగా ఉన్న టీజర్‌పై మీరూ ఓ లుక్కేయండి.
“Meet the #BadGirl! Presented by @anuragkashyap72 & #VetriMaaran, this coming-of-age drama premieres at #IFFR2025! Watch the teaser now!https://t.co/A8oKDk3oCP#BadGirlTheMovie#VetriMaaran#AnuragKashyap#AnjaliSivaraman#VarshaBharath@grassrootfilmco@anuragkashyap72… pic.twitter.com/7XQBM650go
— Red (@elredkumar) January 26, 2025
బ్యాడ్‌గర్ల్ టీజర్..
Gautham Vasudev Menon | ధృవ నక్షత్రం కథకు సూర్య నో చెప్పడం తట్టుకోలేకపోయా: గౌతమ్ మీనన్
SSMB29 Update | సింహన్ని లాక్ చేసిన రాజమౌళి.. SSMB29 ప్రాజెక్ట్ షూరు.!